TS Rythu Bandhu Status 2022 (Link) రైతుబంధు IFMIS treasury.telangana.gov.in || రైతుబంధుకు సన్నద్ధం 2022
తొమ్మిదో విడుత పంపిణీకి సన్నాహాలు TS Rythu Bandhu Status 2022 రైతుబంధు treasury.telangana.gov.in
తొమ్మిదో విడుత పంపిణీకి సన్నాహాలు
కామారెడ్డి జిల్లాలో 2.62 లక్షలకు పైగా మంది అన్నదాతలు
కొత్త పట్టాపాస్ పుస్తకాలు వచ్చిన రైతులకూ అవకాశం
దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
గతంలో కన్నా మరో 10వేల మందికి అదనంగా చేకూరనున్న లబ్ధి.
వానకాలం పంటలకు సమాయత్తమవుతున్న రైతులకు జూన్లో రైతుబంధు సహాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యాసంగితో కలుపుకొని 8 విడుతలుగా పంట పెట్టుబడి సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 9వ విడుత పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నది. కొత్తగా అర్హులైన రైతుల జాబితాను తయారుచేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. ఈ సారి అన్నదాతల బ్యాంకు ఖాతాల మార్పిడికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. 2014కు ముందు వానకాలం రాకముందే రైతులకు పంట పెట్టుబడి కోసం రంది పట్టుకునేది. బ్యాంకులకు వెళ్తే సవాలక్ష కొర్రీలు పెట్టేవారు. తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. లేదంటే విత్తనాలు, ఎరువులు ఉద్దెర తెచ్చుకునే పరిస్థితి ఉండేది.
దూరమైన ఆర్థిక ఇబ్బందులు
వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు పడుతున్న కష్టాలను ఉద్యమ నాయకుడిగా ప్రత్యక్షంగా చూసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. అందులో రైతుబంధు పథకం 2018 వానకాలం సీజన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొదట ఎకరానికి రూ.4వేల చొప్పున అందించారు. ఆ తర్వాత పెట్టుబడి సరిపోకపోవడంతో రూ.5 వేలకు పెంచారు. రెండు సీజన్లకు గాను రూ. 10వేలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహకంతో రైతులకు ఆర్థిక భారం తగ్గింది. సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్నది. దీంతో రైతులకు ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. యాసంగిలో రైతుబంధు పథకం కింద కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలో 2,62,841 మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. 254 కోట్ల 12 లక్షల 37వేల 824 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
జూన్ మొదటి వారంలో అందించేలా కసరత్తు..
సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతకు జూన్ మొదటి వారంలో పెట్టుబడి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ వానకాలం సీజన్లో కొత్తగా అర్హులైన రైతుల జాబితాను తయారు చేసే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో రైతుబంధు జమ అయిన ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానున్నది.
31లోగా దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగా భూములు కొన్న రైతులు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా భూమికొని పట్టాదారు పుస్తకం, లేదా ఆఫీసు కాపీ వచ్చిన రైతులు ఈనెల 31లోగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తులను అందించాలి. తొలకరి జల్లులు పడగానే సాగుపనిలో రైతులు నిమగ్నమవుతారు. ఎరువులు, విత్తనాలు, దుక్కులు తదితర వాటికి పెట్టుబడి డబ్బులు అవసరం అవుతాయి. దీంతోపాటు ప్రభుత్వం రైతుబీమా పథకంతో వారి కుటుంబాల్లో భరోసా నింపింది. సబ్సిడీ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతాంగానికి మద్దతు ధర కల్పించింది.
పంటల సాగుకు ప్రభుత్వ సాయం
పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రోజులు పోయాయి. రైతులకు పెద్దన్నగా కేసీఆర్ ఆదుకుంటున్నారు. రైతుబంధు కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నది. విత్తనాలు, ఎరువులు కొనేందుకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. సాఫీగా పంటలు సాగు చేసుకుంటున్నా.
అప్పుల కోసం ఎన్నో కష్టాలు పడేవాళ్లం
గతంలో పంట పెట్టుబడుల కోసం ఎన్నో అవస్థలు పడేవాళ్లం. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పెట్టుబడి సాయం అందిస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి. సమయానికి పెట్టుబడి డబ్బులు అందుతున్నాయి. ఏడాదికి రెండు సార్లు పెట్టుబడి సాయం ఇస్తున్నారు. వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు.