TS Rythu Runamafi 2023 Updates
రైతులకు రుణమాఫీ సొమ్ము చేరేలా చర్యలు తీసుకోవాలి
Rythu Runamafi
రుణమాఫీ సొమ్ము రైతులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అధికారులను ఆదేశించారు.
రుణమాఫీ సొమ్ము రైతులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో రైతు రుణమాఫీ, సంక్షేమ పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.10వేల రుణ పరిమితి ఉన్న 18.79 లక్షల రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.9,650 కోట్లు విడుదల చేసినట్లు తెలిపిన మంత్రి సాంకేతిక కారణాల వల్ల 1.60 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలు మూసుకుపోవడం వలన వారి ఖాతాల్లో నిధులు జమ కాలేదన్నారు. ఖాతాలు పునరుద్ధరణ కాని రైతుల వివరాలను బ్యాంకర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలియజేయాలన్నారు.
క్షేత్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఆసరా ఫించన్ దరఖాస్తులను మంజూరుచేసి స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మంజూరు చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని వారం రోజుల్లో గృహలక్ష్మి లబ్ధిదారులను ఎంపికచేసి మంజూరు పత్రాలను పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రతి రైతుకు సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలి
ములుగు జిల్లాలోని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కలెక్టర్‌తో పాటు జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు రైతు రుణమాఫీ, ఆసరా పింఛన్, కారుణ్య నియామకాలు, ఇంటి పట్టాల పంపిణీ, గృహలక్ష్మి, జీవో 59 వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్చార్జి అదనపు కలెక్టర్ డీఎస్.వెంకన్న, డీఆర్డీవో నాగపద్మజ, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్‌హైదర్, కలెక్టరేట్ ఏవో ప్రసాద్, ఈడీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.