
ఎస్‌జీటిలో ప్రతీ సిలబస్ కు సమాన వేయిటేజ్ ఉంటుందని నిజామాబాద్ కు చెందిన డీ.చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్, మాథ్స్ అన్నారు. ఒక సబ్జెక్టు ఎక్కువ.. ఒక సబ్జెక్ట్ తక్కువ కాదు అని అన్నారు. ప్రతీ సబ్జెక్టులకు సమానంగా ఉంటుంది. అయితే, మనం చదివే విధానాన్ని బట్టి ఎంతవరకు విజయం సాధిస్తాం? అనేది తెలుస్తుంది. కోచింగ్ పోవద్దు అని నేను అనడం లేదు కానీ సొంతగా చదువుకుంటేనే బాగుంటుంది. మీరు ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేయడం.. గానీ ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్ చెప్పడం చేస్తే మీకు సబ్జెక్టు పై పట్టు వస్తుంది. పిల్లలకు చదువు చెప్పడం వల్ల వచ్చినంత పర్ఫెక్షన్ చదువుకోవడం వల్ల రాదు. టీచింగ్ చేస్తుంటే మనకు ఎక్కువగా సబ్జెక్ట్ పై అవగాహన పెరుగుతుంది. మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే ఒక ఆంశాన్ని తీసుకుంటే సంఖ్యామానం మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ ఉంటుంది.
ప్రతీ టెస్ట్ బుక్ లో ఉన్న సంఖ్య మానాన్ని చదివితే మానకు పూర్తిగా ఆ అంశంపై పట్టు దొరుకుతుంది. మనం సొంతంగా ప్రాక్టీస్ చేసినట్లయితే.. మొత్తం ఓ టాపిక్ కంప్లీట్ అయినా తర్వాత దానికి సంబంధించి ఒక పరీక్ష పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఓ టెస్ట్ పేపర్ ను సాల్వ్ చేసినట్లయితే.. 80 శాతం ఆన్సర్స్ చేస్తే మీరు ఆ టాపిక్ ను పూర్తిగా అర్థం చేసుకున్నట్టు లెక్క. ఎక్కడ మనం ఏ తప్పులు చేశాము? అనే విషయాన్ని పరిశీలన చేసుకుని ఆ తరగతికి సంబంధించిన దానిని మరోసారి రివైజ్ చేసి సెల్ఫ్ టెస్టింగ్ చేసుకుంటే బాగుంటుంది.
మనం సొంతంగా ప్రయత్నిస్తే బాగుంటుంది. అయితే అలాగే రేఖాగణితం చూసినట్లయితే.. నాలుగో తరగతిలో మొదలై ఎనిమిదో తరగతి వరకు చతుర్భుజాలతో ముగుస్తుంది.. నాలుగో తరగతి లో మొదలైన త్రిభుజాలు చతుర్భుజాలు ప్రతీ తరగతిలో ఆ చాప్టర్లు ఏ విధంగా చదవాలి అనే దాన్ని నేర్చుకోవాలి. తర్వాత మార్కెట్లో లభిస్తున్న టెస్ట్ పేపర్స్ ను ఫర్పేక్ట్ గా చదువుకుంటే బాగుంటుంది.. ఇది ఓన్లీ మాథ్స్ అని కాదు అన్ని సబ్జెక్టుల ను మనం టెస్ట్ బుక్ రీడింగ్ చేయడం బెటర్. మార్కెట్లో దొరుకుతున్న మెటీరియల్ అనేది ఒక ప్రజెంటేషన్ గా ఉండదు.
తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా ఐదు సబ్జెక్టులలో కాంటెంట్ తెలిసి ఉండాలి.కంటెంట్ నుంచి 45 మార్కులు వస్తాయి.. అలాగే మెథడాలజి కూడా అన్ని సబ్జెక్టుల్లో కలిపి 30 ప్రశ్నలు ఇస్తారు. 15 మార్కులు వస్తాయి. జీకే కరెంట్ అఫైర్స్ నుంచి మరో 20 మార్కులు వస్తాయి. మొత్తం 80 మార్కులు.. మరో 20 మార్కులు టెట్ ర్యాంక్ ను బట్టి ఇస్తారు.. అయితే మెథడాలజీ అనేది పర్ఫెక్ట్ గా మనకు పాఠం అర్థమైతే దానికి సమాధానం ఇవ్వగలుగుతాము. అయితే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ కూడా కరెక్టే అన్నట్టుగా ఉంటుంది.. కాబట్టి మనం పూర్తిగా అవగాహన అయితే దానికి సరైన సమాధానం ఇవ్వగలం.అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్..
కానిస్టేబుల్ జాబ్స్ కు (Telangana Constable Jobs) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరపడింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనే విషయాలపై దృష్టి పెట్టాలని ఐ 5 కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ నగేష్ సూచిస్తున్నారు.
అర్థమెటిక్ (arithmetic) కు సంబంధించిన
ప్రిపరేషన్ టిప్స్ (Police Jobs Preparation Tips) ను ఆయన వివరించారు. అర్థమెటిక్ నుంచి 25 మార్కులు అడగడానికి అవకాశం ఉందన్నారు.
జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఆ 25 మార్కులకు గాను.. మనము 25 సాధించవచ్చన్నారు. ప్రతీ చాప్టర్ ను పక్కాగా ప్రాక్టీస్ చేయాలన్నారు. ఉదాహరణకు రేషియో అండ్ ప్రపోజిషన్ టాపిక్ తీసుకున్నట్లయితే ఆ రేషియో అండ్ ప్రపోజిషన్ లో అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ఏమున్నాయి? లాంటివి తెలుసుకోవాలన్నారు. అలా చదివితే.. ప్రశ్న ఏదైనా సరే దానిని అవలీలగా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కానిస్టేబుల్ సిలబస్ కు సంబంధించి మొత్తం 20 చాప్టర్స్ ఉన్నాయి. 20 చాప్టర్స్ లో ప్రీవియస్ పేపర్స్ ని ఏవిధంగా అడిగారు? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? లాంటి అంశాలపై ఫోకస్ చేయాలి. ఎవరైతే మోడల్ పేపర్స్ ఎక్కువగా రాస్తారో వాళ్లు స్కోరింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుందన్నారు.
అలా చేసిన వారికి నెగటీవ్ మర్కులు కూడా రాకుండా ఉంటుందన్నారు. ప్రతీ తప్పు సమాధానికి 1/5 నెగటివ్ మార్కు ఉంటుందన్నారు. అంటే ఐదు ప్రశ్నలకు తప్పుగా సమాధానం చేస్తే ఒక మార్కు పోతుందన్నమాట. మాథ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే నెగటివ్ మార్కులతో నష్టపోకుండా 25కు 25 మార్కులు సాధించవచ్చు. కానిస్టేబుల్ ఎగ్జామ్ కు సంబంధించి మొత్తం 200 మార్కులుంటాయి.. ఆ రెండు వందల మార్కుల్లో 25 మార్కులు అర్థమెటిక్ కు ఉన్నాయి. రీజనింగ్ 25 మార్కులు ఉంటాయి.
ఇంగ్లిష్ కు 20 మార్కులు ఇచ్చారు. అదే విధంగా సైన్స్ కి 25 మార్కులు ఇచ్చారు. ఇండియన్ హిస్టరీ 20 మార్క్స్ జాగ్రఫీ కి 15 మార్కులు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కు 20 మార్కులు ఇస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రిమైనింగ్ పార్ట్స్ స్కోరింగ్ ఈజీగా 60 మార్కులు సాధించవచ్చు. ఎగ్జామ్ కు 25 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కనీసం 15 మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం బెటర్. ఆ మోడల్ పేపర్స్ లో మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము? ఎంతవరకు స్కోరింగ్ వస్తుంది? అనే విషయాన్ని గమనించాలి. ఇలా ప్రిపేర్ అయితే మనకు 60 మార్కులు ఈజీగా సంపాధించి క్వాలిఫై అవుతామని వివరించారు.అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్..