Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS TET 2022 || డైలమాలో టెట్‌ అభ్యర్థులు.. అదే రోజు మరో ఉద్యోగ పరీక్ష.. టెట్‌ పరీక్ష తేదీ మార్పుకై అభ్యర్థన..

డైలమాలో టెట్‌ అభ్యర్థులు.. అదే రోజు మరో ఉద్యోగ పరీక్ష.. టెట్‌ పరీక్ష తేదీ మార్పుకై అభ్యర్థన.. కానీ..2022

 

 

 

ఈనెల 12న టెట్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున జాతీయ స్థాయిలో ఆర్ ఆర్ బీ ఎగ్జామ్ ఉండటంతో రెండు క్లాష్ అవుతుండటంతో టెట్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం..

 

TS TET 2022: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షను ఈనెల 12న నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున జాతీయ స్థాయిలో ఆర్ ఆర్ బీ ఎగ్జామ్ ఉండటంతో రెండు క్లాష్ అవుతుండటంతో టెట్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే.. ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెట్ నిర్వహణపై వెనక్కి తగ్గేదే లేదని.. యథాతథంగా జూన్‌ 12వ తేదీనే TS TET 2022 పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే.. అదే రోజును రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఎగ్జామ్ ఉందని.. పలువురు రెండు పరీక్షలూ రాస్తున్నందున తెలంగాణ టెట్‌ పరీక్ష (TS TET 2022) ను వాయిదా వేయాలని కోరుతున్నారు.
అయితే 3 లక్షల 80 వేల మంది అభ్యర్థుల కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని.. ఎగ్జామ్ డేట్ ను అన్ని పరిశీలించాకే ఫిక్స్ చేసినందున యథాతథంగా కొనసాగుతుందని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. టెట్ ఎగ్జామ్ ను అనుకున్న తేదీ కే కంప్లీట్ చేసి.. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ప్రకటించిన తేదీ ప్రకారమే టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్లను సైతం విడుదల చేసింది.

ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష కోసం 2683 సెంటర్లు ఏర్పాటు చేశారు. అబ్జర్వర్లుగా సీనియర్ అధికారులను నియమించారు. టెట్ పేపర్ 1 కు 1480 సెంటర్లలో 3,51,468 మంది అభ్యర్థులు, పేపర్ 2 కు 1203 కేంద్రాల్లో 2,77,000 మంది హాజరుకానున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే కలెక్టర్లు టెట్ నిర్వహణపై సమీక్ష జరిపి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోనికి అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button