TS TET 2022 Paper-2 Question Paper & Key || TS TET 2022 Paper-1 Question Paper & Key
తెలంగాణ టెట్ కొశ్చన్ పేపర్-2 & కీ || తెలంగాణ టెట్ కొశ్చన్ పేపర్-1 & కీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో టెట్ పేపర్–1 & 2 పరీక్షలను నిర్వహించారు. పేపర్–1కు 3,51,468 మంది, పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరిగింది. ఈ టీఎస్ టెట్-2022 పేపర్– 2 ‘కీ‘ ని సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది. ఈ ‘కీ’ ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా పరిగణించండి.
ఈసారి పేపర్–2 రాసే వారికి..
వాస్తవానికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్–2 రాసే వారు కూడా పేపర్–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్–1కు దరఖాస్తులు భారీగా వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించారు. టెట్ పేపర్–1ను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఈ టీఎస్ టెట్-2022 పేపర్– 1 ‘కీ’ ని సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది. ఈ ‘కీ’ ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా పరిగణించండి.