TSLPRB Part 2 Applications
TSLPRB
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పార్ట్ 2 అప్లికేషన్లను తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) స్వీకరిస్తోంది.
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పార్ట్ 2 అప్లికేషన్లను తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) స్వీకరిస్తోంది. ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ (PMT)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) పరీక్షకు సంబంధించిన ‘పార్ట్-2’ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేది అక్టోబరు 27న ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం అయింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ ద్వారా నవంబరు 10న రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలను నమోదు చేసి.. పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలి. దీనిలో అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో.. మొత్తం ఎస్సై పరీక్షకు 2,25,668 మంది హాజరైతే.. దానిలో 1,05,603 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ సివిల్ పరీక్షకు మొత్తం 5,88,891 మంది హాజరైతే.. దీనిలో మొత్తం 1,84,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షకు 41,835 మంది హాజరైతే.. 18,758 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు 2,50,890 మంది హాజరైతే.. 1,09,518 మంది అర్హత సాధించారు. దాదాపు 2.69 లక్షల మంది పార్ట్-2 దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని మండలి వర్గాలు వెల్లడించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించబోమని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది.
ఈ డాక్యుమెంట్స్ అవసరం..
1. డేట్ ఆఫ్ బర్త్ కొరకు DOB సర్టిఫికేట్ లేదా.. పదో తరగతి మెమోను అప్ లోడ్ చేయాలి.
2. ఎస్సై అభ్యర్థులు అయితే.. డిగ్రీ సర్టిఫికేట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఇంటర్మీడియ్ మెమోను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది.
3.బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కింద వర్తిస్తే.. నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వీటిని ఎంఆర్ఓల ద్వారా జారీ చేయపడతాయి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఏప్రిల్ 1, 2021 తర్వాత తీసుకుంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు.
4.ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు EWS సర్టిఫికేట్ ను తీసుకోవాలి. వీటిని అప్లికేషన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
5.1 నంచి 10వ తరగతి వరకు స్డడీ సర్టిఫికేట్స్ ఉండాలి. లేదంటే.. 1 నుంచి 7వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా సరిపోతుంది.
6.ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పినిసరిగా ఉండాలి.
7.ఏజెన్స్ ఏరియాకు చెందిన వారు.. ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
7.ఆధార్ కార్డు, పరీక్ష హాల్ టికెట్స్ ను కూడా దగ్గర ఉంచుకోవాలి.
8.ఇతర రిజర్వేషన్ అభ్యర్థులు రిజర్వేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
9.ఇంతక ముందు నుంచే ప్రభుత్వం ఉద్యోగంలో కొనసాగుతున్న వారు.. సర్వీస్ సర్టిఫికేట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు.. నో డ్యూ సర్టిఫికేట్(No Due Certificate) కూడా అవసరం అవుతుంది.
ఇక పార్ట్ 2 దరఖాస్తులు చేస్తున్న సయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయండి. దరఖాస్తులను సాధ్యమైనంత వరకు చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా.. తొందరగా పూర్తి చేసుకోవడం మంచిది.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబర్ చివరి వారంలో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, పరీక్ష తేదీ వివరాలను నియామక మండలి వెల్లడించనుంది.