TSPSC Group 1 Final Key Released 2022 || Group 1 Updates 2022
గ్రూప్ 1 ఫైనల్ కీ విడుదల.. 5 ప్రశ్నలు తొలగింపు.. మరో రెండు ప్రశ్నలు..
టీఎస్సీఎస్సీ ఫైనల్ కీని విడుదల చేసింది. దీనికి సంబంధించి లింక్ ను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. దీనిపై తదుపరి ఎలాంటి అబ్జెక్షన్స్ తీసుకోవడం జరగదని అభ్యర్థులకు సూచించింది.
టీఎస్సీఎస్సీ ఫైనల్ కీని(TSPSC Final Key) విడుదల చేసింది. దీనికి సంబంధించి లింక్ ను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. దీనిపై తదుపరి ఎలాంటి అబ్జెక్షన్స్ తీసుకోవడం జరగదని అభ్యర్థులకు సూచించింది. అబ్జెక్షన్స్పై ఎక్స్ పర్ట్ కమిటీతో ఎగ్జామిన్ చేయించారు. ఈ ప్రక్రియ పూర్తికావడంతో మంగళవారం ఫైనల్ కీ రిలీజ్ చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ కీలో మొత్తం 5 ప్రశ్నలను డిలీట్ చేయగా.. రెండు ప్రశ్నలకు 1 కంటే రెండు సమాధానాలు ఇచ్చారు. మాస్టర్ కీ ప్రకారం.. 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించారు. 107, 133 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలను ఇచ్చారు. ఇక 57వ ప్రశ్నకు సమాధానాన్ని మార్చినట్లు కీలో పేర్కొన్నారు. అయితే ఈ 5 ప్రశ్నలను పూర్తిగా తొలగించి మొత్తం 145 ప్రశ్నలను పరిగణలోకి తీసుకోనున్నారు. మొత్తంగా ఒక్కో ప్రశ్నకు 1.034 మార్కులను కేటాయించి మెరిట్ లిస్ట్ ను ప్రకటించనున్నారు.
తెలిసిందే. ప్రైమరీ ఆన్సర్ కీతోపాటు ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఓటీఆర్ లాగిన్ ద్వారా ప్రాథమిక కీ, ఓఎమ్ ఆర్ పత్రాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అయ్యి ఓఎంఆర్ షీట్లను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 29, 2022 సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే వెబ్ సైట్లో ఓఎంఆర్ పత్రాలను ఉంచనున్నట్లు పేర్కొన్నారు.