Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
TSPSC Group 1 Update
గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. వారంలో ప్రాథమిక కీ.. ఆ నెలలో మెయిన్స్..!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈ వారంలో విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో తొలిసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈ వారంలో విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ఆన్సర్ ‘కీ’ని 8 రోజుల్లో విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రైమరీ ఆన్సర్ కీతోపాటు ఓఎంఆర్ షీట్ ఇమేజ్ స్కానింగ్‌లను కూడా వెబ్సైట్లో ఉంచనుంది. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది. ఆ ప్రకారంగా ఈ వారంలో కీ విడుదలచేయనున్నట్లు కమిషన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంటే అక్టోబర్ 28లోపు ఈ పరీక్షకు సంబంధించి కీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పరీక్ష జరిగిన రెండు రోజుల తర్వాత నుంచి ఓఎంఆర్ పత్రాల ఇమేజ్ స్కానింగ్ ప్రారభం అయింది. ప్రైమరీ కీపై వచ్చే అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయనున్నారు. ఫైనల్ కీ తర్వాత.. రెండు నెలల్లోపు ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేయనున్నారు. మెయిన్స్ పరీక్ష అనేది ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించే ఆలోచనలో టీఎస్పీఎస్సీ ఉంది.
మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో దాదాపు 3.20 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు.
అంటే 75 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవారిని మెయిన్స్‌కు అనుమతించనున్నారు. ఇదిలా ఉండగా.. పరీక్ష విధానం మాత్రం సివిల్స్ లెవల్ ను మించిపోయిందని అభ్యర్థులు తెలిపారు.
ప్రశ్నల స్థాయి కఠినంగా ఉందని.. ప్రశ్న చదవడానికే తమకు ఎక్కువ సమయం పట్టిందని వాపోయారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు మాత్రం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు 90 లేదా 100 మార్కుల వరకు కట్ ఉంటుందని మొదట్లో భావించినా.. పరీక్ష రాసిన తర్వాత ప్రశ్నల సరళిని బట్టి.. దాదాపు 70 నుంచి 80 మార్కుల వరకు కట్ ఆఫ్ ఉంటే అవకాశం కనిపిస్తోంది.
జనరల్ కేటగిరీ అభ్యర్థులు 70- 80 మార్కులు, బీసీ అభ్యర్థులకు 65-75, ఎస్సీ అభ్యర్థులకు 64-74, ఎస్టీ అభ్యర్థులకు 50-60 మార్కుల కట్ ఆఫ్ ఉండనుంది.