EducationNational & InternationalSocialTelanganaTop NewsUncategorized

TSPSC issues notification for 175 Town Planning officer posts

మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన టీఎస్‌పీఎస్సీ..

 

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువ‌డింది. మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, అర్బ‌న్ డెల‌వ‌ప్‌మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్‌సీర్‌ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 175 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

తెలంగాణ ఆర్థిక శాఖ రాష్ట్ర నిరుద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. తెలంగాణలో మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ లలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్రమ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామని శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.    ఈ క్రమంలో గ్రూప్ – 1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్ పోర్ట్, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పోరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట మెంట్ లో 12,775  ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే.

 

 

TSPSC Municipal Department Notification PDF

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button