TSPSC పేపర్ లీక్.. ఆ పరీక్ష వాయిదా వేసిన అధికారులు
TSPSC clerk & two others held for question paper leak

ఇవాళ జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
రాష్ట్రంలో ఇవాళ జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. తమ అధికారిక సిస్టమ్స్ హ్యాక్ అయినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. దీంతో ఇవాళ జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ బయటకు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేసింది. హ్యాకింగ్, పేపర్ లీక్ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాగా, టీఎస్పీఎస్సీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక, హ్యాకింగ్ కారణంగా టీఎస్పీఎస్సీ ఇప్పటికే మరో రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.