TSPSC Updates
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. ఆన్లైన్లో ఏఈఈ(సివిల్) ఎగ్జామ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టులకు ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
మే 21న OMR బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులతో పాటు సివిల్ పోస్టులకు కూడా ఆన్లైన్లో రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
మే 21, 22 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్ను 2022 సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టులకు 44,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.