TSPSC Group 3 vacancies 2022-23
తెలంగాణ గ్రూప్ 3లో పోస్టులు పెరిగాయ్..! ఆ పోస్టులను కలపడంతో 1,375కి చేరిన ఖాళీల సంఖ్య
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో మరో 12 పోస్టులు అదనంగా చేరాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే..
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో మరో 12 పోస్టులు అదనంగా చేరాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసినట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి. ఇప్పటికే విడుదలైన గ్రూప్ 3 నోటిఫికేషన్లో 1,363లను భర్తీ చేయనున్నట్లు కమిషన్ తెల్పింది. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది. ఈ మేరకు పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ పోస్టులకు ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే.
జనవరి 23న ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసుండాలి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు గడువు తేదీ వరకు వేచి ఉండకుండా త్వరపడి దరఖాస్తు చేసుకోవల్సిందిగా కమిషన్ ఈ సందర్భంగా తెల్పింది. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.280లు రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష మొత్తం మూడు పేపర్లకు కలిపి 450 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.