TSPSC Updates 2023 || తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ దరఖాస్తు ప్రక్రియ నెల రోజులు వాయిదా.. వివరాలివే
TSPSC Updates
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కళాశాల విద్యాశాఖ కింద డిగ్రీ కాలేజీల్లో మొత్తం 544 ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. కళాశాల విద్యాశాఖ కింద డిగ్రీ కాలేజీల్లో మొత్తం 544 ఉద్యోగాల (Jobs) భర్తీకి డిసెంబరు 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వాస్తవానికి జనవరి 31న ప్రారంభం కావాల్సి ఉండగా.. ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు. అయితే.. తాజాగా మరో సారి దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. మార్చి 20వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మే లేదా జూన్లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
ఖాళీల వివరాలు:
1) అసిస్టెంట్ ప్రొఫెసర్స్: 491
– ఇంగ్లిష్ – 23
– తెలుగు – 27
– ఉర్దూ – 02
– సంస్కృతం – 05
– స్టాటిస్టిటిక్స్ – 23
– మైక్రోబయాలజీ – 05
– బయోటెక్నాలజీ – 09
– అప్లయిడ్ న్యూట్రీషన్ – 05
– కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ – 311
– కామర్స్-బిజినెస్ అనలిటిక్స్ (స్పెషలైజేషన్) – 08
– డెయిరీ సైన్స్ – 08
– క్రాప్ ప్రొడక్షన్ – 04
– డేటాసైన్స్ – 12
– ఫిషరీస్ – 03
– కామర్స్ (ఫారీన్ ట్రేడ్-స్పెషలైజేషన్) – 01
– కామర్స్(టాక్సేషన్-స్పెషలైజేషన్) – 06
2) ఫిజికల్ డైరెక్టర్: 29
3) లైబ్రేరియన్: 24
అయితే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నెట్(NET) లేదా సెట్(SET) లో ఉత్తీర్ణత సాధించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రెండు సార్లు నెట్ పరీక్షను(NET Exam) నిర్వహిస్తారు. అయితే తెలంగాణలో మాత్రం సెట్ పరీక్ష నిర్వహించి 3 ఏళ్లు దాటిపోయింది. చివరిసారిగా 2019లో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష – టీఎస్ సెట్ నోటిఫికేషన్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.