Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Tummala on Rythu Bharosa

రైతు భరోసాపై కీలక అప్డేట్.. ఆలోపే రైతుల ఖాతాల్లోకి నిధులు 2025 మంత్రి తుమ్మల

 

Tummala on Rythu Bharosa Funds

2025తెలంగాణ రైతులు రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంకా నిధులు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎరువుల కొరత లేకుండా చూస్తామని, మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.

 

  • రైతు భరోసా నిధుల విడుదలపై తుమ్మల కీలక ప్రకటన
  • వానాకాలం వరి నాట్లు పడే నాటికి డబ్బులు జమ
  • అర్హులందరికీ రైతు భరోసా

 

 

ఖరీఫ్ సీజన్ వచ్చేసింది కానీ ఇంకా పాత విడత నిధులే చాలా మంది రైతులకు అందలేదు. ఇటు చూస్తే వానాకాలం మొదలయ్యింది. పంటల సాగుకు రైతుల సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తే బాగుండు.. పెట్టుబడికి పనికి వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి  నిధుల విడుదలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

 

 

రాష్ట్రంలో ఖరీఫ్‌ నాట్లు వేయడానికి కన్నా ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మార్కెట్‌లో రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ.. రైతు భరోసా నిధుల విడుదలపై తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాము. . త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం. ఇక మాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పంట కాలంలో రూ.35 వేల కోట్లు జమ చేశాం అని చెప్పుకొచ్చారు.

Related Articles

Back to top button