Education

UPSC NDA EXAM II NOTIFICATION 2019 || UPSC భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్‌ ద్వారా ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 415 -నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ: 370 పోస్టులు (ఇండియన్‌ ఆర్మీ-208, ఇండియన్‌ నేవీ-42, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌-120) -ఇండియన్‌ నేవల్‌ అకాడమీ-45 పోస్టులు (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌) అర్హతలు: -ఆర్మీ వింగ్‌ (ఎన్‌డీఏ) : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్‌ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. -ఎయిర్‌ ఫోర్స్‌/నేవల్‌ (ఎన్‌డీఏ)/ఇండియన్‌ నేవల్‌ అకాడమీ: ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లతో ఇంటర్‌ లేదా 10+2లో ఉత్తీర్ణత. ఇంటర్‌ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును.

వయస్సు: 18 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి. (2 జనవరి 2001 నుంచి 1 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి) శారీరక ప్రమాణాలు: -ఎత్తు: 157.5 సెంటీమీటర్లు, ( ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 162.5 సెంటీమీటర్లు) -బరువు: ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉండాలి. -కంటిచూపు: 6/6, 6/9 -ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో.. -15 నిమిషాల్లో 2.4 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి -స్కిప్పింగ్‌ చేయాలి -3-4 మీటర్ల రోప్‌ ైక్లెంబింగ్‌ చేయాలి. -20 ఫుష్‌ అప్‌లు, 8 చిన్‌ అప్‌లు చేయాలి. -అప్లికేషన్‌ ఫీజు: రూ. 100/- జనరల్‌/ఓబీసీ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు) -జీతభత్యాలు: రూ. 56,100/- శిక్షణ సమయంలో స్టయిఫండ్‌ చెల్లిస్తారు.

పదోన్నతులు: ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌ల్లో లెఫ్టినెంట్‌/సబ్‌ లెఫ్టినెంట్‌/ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ నుంచి జనరల్‌/అడ్మిరల్‌/ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ హోదా వరకు వెళ్లవచ్చు. -పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, వైజాగ్‌, బెంగళూరుతోపాటు దేశవ్యాప్తంగా 41 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. -ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా.

రాత పరీక్ష విధానం: రాతపరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ రాతపరీక్షలో రెండు విభాగాలు (పేపర్‌ 1, పేపర్‌ 2) ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు. మ్యాథమెటిక్స్‌ (పేపర్‌ 1)-300 మార్కులు, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (పేపర్‌ 2)- 600 మార్కులు. -ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూకు 900 మార్కులు -మొత్తం (రాతపరీక్ష+ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ)-1800 మార్కులకుగాను అత్యధిక ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేసి ట్రెయినింగ్‌ ఇస్తారు. -పేపర్‌1 (మ్యాథ్స్‌)లో ఆల్‌జీబ్రా, మ్యాట్రిసెస్‌ అండ్‌ డిటర్మెనెంట్స్‌, త్రికోణమితి, అనలిటికల్‌ జామెట్రీ (2 లేదా 3 డైమెన్షన్స్‌), డిఫరెన్షియల్‌ క్యాలిక్యులస్‌, ఇంటిగ్రల్‌ క్యాలిక్యులస్‌ & డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, వెక్టార్‌ ఆల్‌జీబ్రా, స్టాటిస్టిక్స్‌ & ప్రాబబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. -పేపర్‌-2 (జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌)లో పార్ట్‌-ఏలో ఇంగ్లిష్‌, పార్ట్‌-బీలో జనరల్‌ నాలెడ్జ్‌ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్‌, హిస్టరీ, ఫ్రీడమ్‌ మూవ్‌మెంట్‌, జాగ్రఫీ, కరెంట్‌ ఈవెంట్స్‌) నుంచి ప్రశ్నలు ఇస్తారు.

రాతపరీక్షలో నెగెటివ్‌ మార్కిగ్‌ విధానం ఉంది. -ఈ పరీక్షలో మెరిట్‌ పొందినవారికి (ఎన్‌డీఏకు 144వ కోర్సు, నేవల్‌ అకాడమీకి 106వ కోర్సు) 2020 జూలై 2 నుంచి శిక్షణ ప్రారంభిస్తారు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: సెప్టెంబర్‌ 3 (సాయంత్రం 6 గంటల వరకు) -రాతపరీక్ష: నవంబర్‌ 17 -ఫలితాలు విడుదల: డిసెంబర్‌లో -వెబ్‌ సైట్‌: www.upsc.gov.in -నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీకి ఎంపికైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలకు చెందిన అభ్యర్థులకు మూడేండ్లపాటు అకాడమిక్‌, ఫిజికల్‌ ట్రెయినింగ్‌ ఉంటుంది. మొదటి రెండేన్నర ఏండ్లపాటు మూడు విబాగావారికి ఒకే విధమైన శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత మూడు సేవలకు ఎంపికైన అభ్యర్థులకు జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి కింది డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. -ఆర్మీ క్యాడెట్స్‌ – బీఎస్సీ/బీఎస్సీ/బీఏ (కంప్యూటర్‌) -నేవల్‌ క్యాడెట్స్‌- బీటెక్‌ -ఎయిర్‌ఫోర్స్‌ క్యాడెట్స్‌- బీటెక్‌ -ఎజిమలలోని నేవల్‌ అకాడమీకి ఎంపికైనవారికి నాలుగేండ్లపాటు అకడమిక్‌, ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది.

శిక్షణ అనంతరం వీరికి బీటెక్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. -ఎన్‌డీఏలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత ఆర్మీ అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అభ్యర్థులకు ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఎజిమల)కి, ఎయిర్‌ఫోర్స్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకామీకి పంపిస్తారు. వీరికి ఆయా విభాగాల్లో ఏడాదిపాటు శిక్షణ ఇచ్చి అనంతరం లెఫ్టినెంట్‌ హోదాలో ఉద్యోగం ఇస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button