TS Group-1 Prelims Exam Updates Today 2022
గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాపై TSPSC స్పందన.. అలా జరిగితే ఏడాది వరకు నో ఎగ్జామ్.. పూర్తి వివరాలివే 2022
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదా పడుతుందన్న ప్రచారం చేపథ్యంలో TSPSC స్పందించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఆయా కలెక్టర్లకు వివరించారు. రాష్ట్రం మొత్తం మీద గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 1040 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గ్రూప్-1 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఆయా తేదీ నుంచి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఇంకా ఈ ఎగ్జామ్ వాయిదా పడుతుందన్న ప్రచారంపై సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష వాయిదా పడదని పబ్లిక్ సర్వీస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఏదైనా కారణాలతో పరీక్షను వాయిదా వేయాల్సి వస్తే.. మరో ఏడాది వరకు తిరిగి నిర్వహించే పరిస్థితి లేదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి.
అప్పటి వరకు ప్రతీ ఆదివారం ఏదో ఓ పరీక్ష షెడ్యూల్ చేయబడి ఉండడమే ఇందుకు కారణమని తెలిపాయి. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు వివరించాయి.
గత ఏప్రిల్ లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో 121 ఎంపీడీఓ ఉద్యోగాలు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, 42 డిప్యూటీ కలెక్టర్, 41 మున్సిపల్ కమిషనర్ ఖాళీలు ఉన్నాయి.
40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా 2011లో 312 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలి గ్రూప్-నోటిఫికేషన్.