మల్లన్న సాగర్ బాధితుల విషయంలో తెలంగాణ హై కోర్ట్ సంచలన నిర్ణయం || today Telangana high Court judgement of mallanna Sagar land issue
తెలంగాణ హై కోర్ట్ సంచలన నిర్ణయం. మల్లన్న సాగర్ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన గజ్వేల్ RDO విజయేందర్ రెడ్డి తోగుట తహసిల్దార్ ప్రభువుకు రెండు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయలు నష్టపరిహారంగా జరిమానా మరియు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. మల్లన్న సాగర్ ర్ న స పరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంతో తమకు న్యాయం జరగలేదని బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించడం జరిగింది. నిర్వాసితుల పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం అధికారులకు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనితోపాటు తక్షణమే మల్లన్న సాగర్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంక్షలు విధిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది.