9000 Anganwadi Jobs 2024-25
9000 అంగన్‌వాడీల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, మార్గదర్శకాలు ఇవే..
తెలంగాణలోని మహిళలకు మరో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నది. అంగన్‌వాడీ కేంద్రాలను ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నది.
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 9000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.
అంగన్‌వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టుల అర్హతలు ఇవే..
నూతన నియామక అర్హతలు ఇలా..
నెలకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని..
అంగన్‌వాడీ టీచర్లకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు జొన్నలగడ్డ వెంకటరమణ కోరారు. నల్లగొండలోని టీఎన్‌జీఓస్ భవన్‌లో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. సిబ్బందికి హెల్త్ కార్డులతో పాటు కమర్షియల్ సిలిండర్లను డొమెస్టిక్‌గా మార్చి ఒక్కో సెంటర్‌కు డబుల్ సిలిండర్లను ఇవ్వాలన్నారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్, మరుగుదొడ్ల వసతి కల్పించాలన్నారు. కూరగాయల బిల్లులు పెంచాలన్నారు.
మేము చేసేది చిరుద్యోగం. చాలీచాలని జీతం.. అన్నీ ముందస్తుగా చెల్లిస్తూ ఎప్పటికో కానీ వచ్చే బిల్లుల కోసం ఎదురుచూసే తెలంగాణలోని అంగన్‌వాడీలకు కరెంట్ బిల్లులు మరింత భారం అవుతున్నాయి. తిరిగి వచ్చే విధానం అమల్లో లేకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లు సొంతంగానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండగా.. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలాగే, కాలం వెళ్లదీస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జీతాలు ఎప్పడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేకపోయినా కరెంట్ బిల్లుల విషయంలోనూ కొత్త ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
అంగన్‌వాడీ టీచర్లు కేంద్రాలకు సంబంధించి ప్రతినెల కరెంట్ బిల్లు కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఏడు ప్రాజెక్టులకు గాను 1,837 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అద్దె భవనాల్లో, ఇంకొన్ని సొంత భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. భవనం ఏదైనా విద్యుత్ బిల్లుల సమస్య మాత్రం అంతటా ఉంది. కరెంట్ బిల్లులు చెల్లించేందుకు ఏ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వకపోవడంతో జీతంలో నుంచే చెల్లించాల్సి వస్తోందని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. మా సమస్యలపై ఎన్నిసార్లు పాలకులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని టీచర్లు చెబుతున్నారు.
తాజాగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇరవై రోజుల పాటు అందోళన చేసినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కాగా శాఖలన్నింటికీ ప్రభుత్వం ఇతర ఖర్చుల కింద(మిస్‌లేనియస్) కొంత మేర నిధులు కేటాయిస్తుంది. కానీ గర్భిణులు మొదలు శిశువుల ఆలనాపాలన చూసే అంగన్‌వాడీలకు తక్కువ జీతాలు అందుతుండగా.. విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులకు సైతం గ్రాంట్ అందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలోని 1,837 అంగన్వాడీ కేంద్రాలకు నెలనెలా రూ.250 నుంచి రూ.300 మేర విద్యుత్ బిల్లు వస్తుంది. అంటే జిల్లాలో రూ.4 లక్షల మేర బిల్లులను అంగన్‌వాడీ టీచర్లే ఏళ్ల తరబడి చెల్లిస్తున్నారు. తద్వారా ఒక్కో టీచర్ ఏటా రూ.3వేలు కరెంట్ బిల్లుకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. గత ప్రభుత్వం ఈ సమస్యకు దారి చూపలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమ ఆవేదను పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.