Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TSPSC Alert

టీఎస్పీఎస్సీ అలర్ట్.. ఆ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..

 

 

పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి అడ్మిట్ కార్డులను టీఎస్పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in ద్వారా మీ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.

పాలిటెక్నిక్ లెక్చరర్(Polytechnic Lecturers) ఉద్యోగాలకు సంబంధించి అడ్మిట్ కార్డులను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in ద్వారా మీ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. పరీక్షలను సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు ఆన్లైన్లోనిర్వహించనున్నట్టు ప్రకటించారు. వివిధ సబ్జెక్టులకు మూడు విడతలుగా పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వేర్వేరు సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే.. ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా హాల్టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కమిషన్ వెబ్సైట్లో ఉన్న మాక్ టెస్టు లింక్స్ ద్వారా పరీక్షలను ప్రాక్టీస్ చేయాలని కోరారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 19 విభాగాల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చ‌రర్ల పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ గత ఏడాది డిసెంబర్ 7న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. వీటికి డిసెంబర్ 14 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించారు. అయితే ఈ పరీక్షను ఏప్రిల్ లోనే నిర్వహించాల్సి ఉంది. కానీ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో దీనిని మే 13న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తర్వార మళ్లీ.. వివిధ కారణాలతో ఈ పరీక్షను సెప్టెంబర్ 04వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. ఈ పోస్టులను మల్టీ జోన్ల వారీగా భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1 లో 93 పోస్టులుండగా.. మల్టీ జోన్ 2లో 154 పోస్టులున్నాయి.

 

 

Related Articles

Back to top button