Anganwadi Jobs
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వేలల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎంతో మంది నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వేలల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టబోతోందట.
తెలంగాణలో (Telangana) ఉద్యోగాల కోసం ఎంతో మంది కళ్ళకు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికెషన్స్ (Telangana Job Notifications) రిలీజ్ అవుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే మరో గుడ్ న్యూస్ చెప్పబోతోందని సమాచారం. భారీగా అంగన్వాడీ (Anganwadi Jobs) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట.
రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుతం నిర్ణయం తీసుకోవడంతో.. కొత్తగా 8000 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడిందట. దీంతో ఈ ఉద్యోగాలను వెంటనే ఫిల్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ మేరకు అంగన్వాడీ ఉద్యోగాల త్వరలోనే భారీ ఎత్తున నోటిఫికేషన్ వేయబోతున్నారని సమాచారం.