AP Inter Results 2023
ఇంటర్ ఫలితాలు విడుదల.. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్ వెల్లడి 2023
1st 2nd Year AP Intermediate Results 2023 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15వ తేదీన ఫస్టియర్, మార్చి 16వ తేదీన సెకండియర్ పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే.
AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 26) విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడదల చేయనున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రథమ సంవత్సరం, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే.
పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తోంది ఇంటర్ బోర్డు. ఈ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 26) సాయంత్రం నుంచి http://examresults.ap.nic.in/ మరియు https://bieap.apcfss.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్సైట్లలో విద్యార్ధులకి అందుబాటులో ఉంటాయి.
CBSE : త్వరలోనే సీబీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు
లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 10, 12వ తరగతి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. వచ్చే వారమే పరీక్షల ఫలితాలను CBSE బోర్డు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. ఫలితాల విడుదలకు సంబంధించి CBSE బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విద్యార్థులు https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/ వెబ్సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.