AP Outsourcing jobs 2023
ఆంధ్రప్రదేశ్ నందు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APSACS ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి, కాకినాడ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు వైద్య విధాన పరిషత్ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన రెండు నోటిఫికేషన్లు విడుదలైంది. ఇందులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, లాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుచేసుకోగలరు.
APSACS నోటిఫికేషన్ నుండి మొత్తం 09 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
ART మెడికల్ ఆఫీసర్ | 01 పోస్టులు |
ART సెంటర్ స్టాఫ్ నర్స్ | 01 పోస్టులు |
ART కౌన్సెలర్ | 01 పోస్టులు |
ART ఫార్మసిస్ట్ | 01 పోస్టు |
ART డేటా మేనేజర్ | 01 పోస్టు |
ICTC ల్యాబ్ టెక్నీషియన్ | 01 పోస్టు |
ల్యాబ్ అటెండర్ | 01 పోస్టు |
ఆడియో మెట్రిషియన్ | 01 పోస్టు |
ఫార్మసీస్ట్ | 01 పోస్ట్ |
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27, 2023 తేది నుండి ఆఫ్లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోగలరు.
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
APSACS నోటిఫికేషన్ చిరునామా :
జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు TB కార్యాలయం, 2వ అంతస్తు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం కాకినాడ జిల్లా, కాకినాడ.
APVVP నోటిఫికేషన్ చిరునామా :
DCHS, Erstwhile East Godavari District, Community Health Centre Campus, Kovvuru
దరఖాస్తు ఫీజు :
APSACS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 350/- |
మిగితా అభ్యర్ధులు | రూ 250/- |
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | అక్టోబర్ 27, 2023 |
దరఖాస్తు చేయుటకు చివరి తేది | అక్టోబర్ 31, 22023 |
APVVP నోటిఫికేషన్, దరఖాస్తు చేయుటకు చివరి తేది | నవంబర్ 03, 2023 |
APSACS Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
APSACS Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APSACS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు
- BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
- ART మెడికల్ ఆఫీసర్ – MBBS
- ART సెంటర్ స్టాఫ్ నర్స్ – GNM, B.Sc నర్సింగ్
- ART ఫార్మసిస్ట్ – ఫార్మసీలో డిప్లొమా/డిగ్రీ
- ART కౌన్సెలర్ – పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లొమా
- ART డేటా మేనేజర్ – డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్/ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్
- ICTC ల్యాబ్ టెక్నీషియన్ – MLTలో డిప్లొమా / గ్రాడ్యుయేషన్
- ల్యాబ్ అటెండర్ – 10వ తరగతితో పాటు ల్యాబ్ అటెండర్ కోర్సు కలిగి ఉండాలి. లేదా ఇంటర్ ఓకేషల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ తదితర ఉద్యోగాల రెండు మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
ఇంటర్వ్యూ |
సర్టిఫికెట్ వెరిఫికేషన్ |