AP SSA KGBV Recruitment 2021 – KGBV CRTs, PET, Special Officers Syllabus and Exam Pattern 2021-22
రాష్ట్రంలో నీ కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టు విధానంలో మొత్తం 958 పోస్టులు భర్తీకి అంగీకారం తెలిపింది.
AP KGBV Teacher Posts 958 Recruitment
కాంట్రాక్ట్ విధానంలో 958 టీచర్ పోస్టుల భర్తీ కి అనుమతి ఇచ్చారు.
రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీలు ఉన్నాయి.
రాష్ట్రంలో నీ కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టు విధానంలో మొత్తం 958 పోస్టులు భర్తీకి అంగీకారం తెలిపింది. తద్వారా విద్యార్థుల బోధనకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 352 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో లక్షమంది వరకు అనాథలు, నిరుపేద బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు.
6వ తరగతి నుండి 12వ తరగతి వరకు వీరికి బోధిస్తున్నారు. గతంలో కేజీబీవీల్లో 6 నుంచి 10వ తరగతి వరకే ఉండగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టించారు. 10వ తరగతి ఆ తర్వాత అనాధ బాలికలు వేరే ప్రాంతంలో లోని కాలేజీలో చేరే స్థోమత లేక మధ్యలోనే మానేస్తున్నారు. దీన్ని నివారించడానికి సీఎం దశలవారీగా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీలో ఇప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లను నియమించి ఇంటర్మీడియట్ తరగతులను బోధిస్తున్నారు.
ఇక బోధన సమస్యలకు చెక్
మరోవైపు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న హై స్కూల్ లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు (సిఆర్టీలు) పనిచేస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కేజీబీవీల్లో సిబ్బంది మొత్తం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. కొంతకాలంగా ఈ స్కూళ్ల, కాలేజీలో కొత్తగా నియామకాలు లేక విద్యార్థులకు బోధన సమస్య ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కూళ్ల లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నాలుగు నెలల క్రితమే ప్రభుత్వానికి సమగ్ర శిక్ష అభియాన్ ప్రతిపాదనలు పంపింది. తాజాగా ప్రభుత్వం ఆమోదం రావడంతో భర్తీకి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సీఆరీలు, పీఈటీలు సంబంధించి 389 పోస్టులను, కాలేజీలకు అవసరమైన పీఈటీ పోస్టులు 569ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
రాష్ట్రస్థాయిలో ఎంపికలు
ఈ పోస్టులను జిల్లాల స్థాయిలో డీఎస్సీ ల ద్వారా ఎంపిక చేయాలని ముందు భావించారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యలతో రాష్ట్రస్థాయిలోనే ఎంపిక చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ నిర్ణయించింది. తర్వాత డీఎస్సీ ద్వారా నిర్ణయించింది. ప్రస్తుతం నాలుగు నెలల క్రితం నాటి ఖాళీలనుమ భర్తీ చేయనుంది. ఆ తదుపరి వచ్చిన ఖాళీలను కూడా గెస్ట్ టీచర్ల తో భర్తీ చేస్తుంది. బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
జిల్లాల వారీగా బోధన పోస్టులు ఇలా
జిల్లా సీఆర్టీ&పీఈటీ -పీజీటీ
శ్రీకాకుళం 47 – 40
విజయనగరం 18 -123
విశాఖపట్నం 54 -114
తూర్పుగోదావరి 28 -14
పశ్చిమ గోదావరి 2 -2
కృష్ణ 3 -0
గుంటూరు 21 -8
ప్రకాశం 35 -12
నెల్లూరు 18 -6
చిత్తూరు 19 -39
వైయస్సార్ 29 -109
అనంతపురం 58 -77
కర్నూల్ 57 -25
మొత్తం 389 -569.
IMPORTANT LINKS
AP & TS KGBV FULL DETAILS 2021-22