DRDO recruitment updates 2021-22 || DRDO jobs vacancy notification out 2021
DRDO Recruitment 2021:
డీఆర్డీఓలో ఫెలోషిప్ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ.. జీతం రూ.31,000
DRDO Recruitment 2021: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (Defence Research and Development Organisation) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని డిఫెన్స్ లాబొరేటరీలో తన ప్రాజెక్ట్ కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఫెలోషిప్ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ.. జీతం రూ.31,000.
డిఫెన్స్ లాబొరేటరీలో తన ప్రాజెక్ట్ కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ఆధారంగా ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ (Chemistry), మెకానికల్ బ్రాంచ్‌లలో 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిసెంబరులో జరగనున్న వాక్-ఇన్-ఇంటర్వ్యూ (Walk In Interview) కోసం అవసరమైన అన్ని అర్హత ప్రమాణాలతో అభ్యర్థులు ఆహ్వానించబడ్డారు.
ఫిజిక్స్ బ్రాంచ్‌కు డిసెంబర్ 6, 2021న, కెమిస్ట్రీకి డిసెంబర్ 7, 2021న, ఎలక్ట్రానిక్స్‌కు డిసెంబర్ 8, 2021న, మెకానికల్‌కు డిసెంబర్ 9, 2021న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.drdo.gov.in/careers ను సందర్శించాల్సి ఉంటుంది.
అర్హతలు..
– దరఖాస్తుదారులు తప్పనిసరిగా మొదటి డివిజన్‌తో సంబంధిత స్ట్రీమ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ (MSc లేదా తత్సమానం) కలిగి ఉండాలి.
JP Morgan Jobs: జేపీ మోర్గాన్ హైదరాబాద్ బ్రాంచ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్
– CSIR-UGC (NET), MHRD (GATE) లేదా JEST ద్వారా నిర్వహించబడే జాతీయ అర్హత పరీక్ష (NET)లో ఉత్తీర్ణులై ఉండాలి.