DRDO Notification 2022
DRDO Jobs 2022
DRDO Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. DRDO నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
DRDO Jobs 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DRDO(CEPTAM) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DRDO(CEPTAM) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1061 పోస్టులను భర్త చేయనున్నారు. దీనిలో స్టినోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ‘ఎ’, స్టోర్ అసిస్టెంట్ ‘ఎ’, సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఎ’ వెహికల్ ఆపరేటర్ ‘ఎ’, ఫైర్ ఇంజన్ డ్రైవర్ ‘ఎ’, ఫైర్‌మ్యాన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను https://www.drdo.gov.in/ సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, అర్హత తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ | 33 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I | 215 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II | 123 |
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-A (ఇంగ్లీష్ టైపింగ్) | 250 |
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-A (హిందీ టైపింగ్) | 12 |
స్టోర్ అసిస్టెంట్-A (ఇంగ్లీష్ టైపింగ్) | 134 |
స్టోర్ అసిస్టెంట్-A (హిందీ టైపింగ్) | 4 |
సెక్యూరిటీ అసిస్టెంట్-ఎ | 41 |
వెహికల్ ఆపరేటర్-ఎ | 145 |
ఫైర్ ఇంజన్ డ్రైవర్-A | 18 |
అగ్నిమాపక సిబ్బంది | 86 |
మొత్తం పోస్టుల సంఖ్య | 1061 |
వయోపరిమితి: అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి.
SC/ST/మహిళలు/ESM/PWD అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్హత: DRDO CEPTAM అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10, 12, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్/ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి.
జీతం: నెలకు రూ. 19,900 నుంచి రూ. 1,12,400 మధ్య చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 07-11-2022
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 07-డిసెంబర్-2022
దరఖాస్తు విధానం ఇలా..
-ముందుగా, అధికారిక వెబ్సైట్ drdo.gov.in ని సందర్శించండి.
-దరఖాస్తు చేయబోయే DRDO CEPTAM రిక్రూట్మెంట్ లేదా కెరీర్ వద్ద నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి.
– దరఖాస్తు ఫారమ్‌ను ప్రారంభించే ముందు చివరి తేదీని జాగ్రత్తగా తనిఖీ చేయండి.
-మీకు అర్హత ఉంటే, ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
-దరఖాస్తు రుసుమును (వర్తిస్తే) చెల్లించి, చివరి తేదీ (07-డిసెంబర్-2022)లోపు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.
-చివరగా మీ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
IMPARTENT LINKS