Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
Group 2 | Group 3 Jobs || అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాల్లో కీలక మార్పులు..
ఇక నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహణలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇక నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహణలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీపీఎస్సీ లేదా ఇంటర్ సాంకేతిక విద్యా సంస్థ నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికేట్ లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసులకు అవకాశం లేదంటూ నిబంధనలు జారీ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు కనీసం 30 మార్కులు, బీసీలు 35 మార్కులు, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు వివిధ రకాలు ఆపరేటింగ్ సిస్టమ్ లు విండోస్, ఇంటర్ నెట్ వంటి అంశాల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంటూ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు.