Jobs 2023
మహిళా డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
పాల్వంచ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్, కంఫ్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల ఖమ్మం రీజియన్ (ఆర్సీఓ) సమన్వయ అధికారి కె.ప్రత్యూష అక్టోబర్ 6న ఒక ప్రకటనలో తెలిపారు.
ల్యాబ్ అసిస్టెంట్ 2, కంఫ్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 1 పోస్టు ఉన్నాయని పేర్కొన్నారు. ల్యాబ్ అసిస్టెంట్ల్లో ఒక పోస్టు ఎస్సీ మహిళలకు, మరో పోస్టు జనరల్ మహిళలకు, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ జనరల్ మహిళలకు కేటాయించామని పేర్కొన్నారు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు అక్టోబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ప్రాంతీయ సమన్వయఽ అధికారి కార్యాలయం, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఖమ్మం రీజియన్, కొత్త కలెక్టరేట్, వెంకటాయపాలెం చిరునామాకు పంపించాలని తెలిపారు.