Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

KGBV Recruitment 2024

కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

 

 

 

కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష, అడిషినల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ ఎం.వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

గత నెల 26 నుంచి ఈ నెల 10వ వరకు apkgbv.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసే సమయంలో ఆన్‌లైన్‌లో పలు సమస్యలు తలెత్తుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో అమరావతిలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

 

టోల్‌ ఫ్రీ నంబర్లు 70750 39990, 70751 59996లకు ఫోన్‌ చేస్తే సాంకేతిక సమస్యలు నివృత్తి చేస్తారని ఆమె సూచించారు. మరిన్ని సందేహాలకు జిల్లా కార్యాలయం ఫోన్‌ నంబర్‌ 99850 35247లో కూడా సంప్రదించవచ్చునన్నారు.

 

 

 

 

Related Articles

Back to top button