PM Kisan
రైతులకు గుడ్న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు.. నేరుగా ఖాతాలోకే..!
PM Kisan FPO Scheme 2023: రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన వార్త వచ్చింది. ఈ మేరకు రూ.18 లక్షలు రైతులకు అందనున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది.
PM Kisan: రైతులకు అద్భుతమైన వార్త అందింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు అందనున్నాయి. అవును… రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనాన్ని పొందుతున్నారు. దీని కింద ప్రభుత్వం ఏటా రూ.6000 మొత్తాన్ని రైతుల ఖాతాలకు బదిలీ చేస్తోంది. ఇప్పుడు రైతులకు లక్షల్లో లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఏ పథకం కింద రూ.18 లక్షల ఆర్థిక సాయం ఇస్తుందో ఇప్పుడు చూద్దాం..
రైతులు కూడా ఈ పథకం కింద బ్యాంకుల నుంచి తక్కువ ధరలకు రుణాలను పొందగలరు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ ఎఫ్పీఓ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థకు రూ.18 లక్షలు అందజేస్తారు. కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, 11 మంది రైతులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయడం కూడా సులభతరం కానుంది.