pm kisan 2023
ఇలాంటి రైతులకు పీఎం కిసాన్ తదుపరి వాయిదా రాకపోవచ్చు..!
ఇలాంటి రైతులకు పీఎం కిసాన్ తదుపరి వాయిదా రాకపోవచ్చు..!
దెకరాల లోపు సాగు భూమి కలిగిన రైతు కుటుంబానికి రూ.6,000 సాయాన్ని కేంద్ర సర్కారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏటా అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు వాయిదాలుగా ఇస్తోంది. ఇందులో భాగంగా రైతులకు 13వ వాయిదా ఫిబ్రవరిలో అందాల్సి ఉంది. ఈ క్రమంలో రైతులకు కీలక సూచన జారీ అయింది. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకే తాజా సాయం అందనుంది.
రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ తో ఇప్పటికీ అనుసంధానించుకోకపోతే వెంటనే ఆ పని చేయాలి. రైతులు పీఎం కిసాన్ పోర్టల్ కు వెళ్లి ఆధార్ ను లింక్ చేసుకోవచ్చు. సమీపంలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కు వెళ్లి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) ఆధారిత అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ద్వారా సాయాన్ని పొందొచ్చు. ఎస్ బీఐ ఖాతాదారులు అయితే బ్యాంకు లో నమోదైన తమ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి యూఐడీ ఆధార్ నంబర్, స్పేస్, అకౌంట్ నంబర్ టైప్ చేసి 567676 నంబర్ కు పంపించాలి.
కుటుంబానికి రూ.6,000 సాయాన్ని కేంద్ర సర్కారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏటా అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు వాయిదాలుగా ఇస్తోంది. ఇందులో భాగంగా రైతులకు 13వ వాయిదా ఫిబ్రవరిలో అందాల్సి ఉంది. ఈ క్రమంలో రైతులకు కీలక సూచన జారీ అయింది.