Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Andhra CM Jagan distributes Rs 3923 crore to farmers || Rythu Bharosa Updates 2023

రైతుల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!! || Rythu Bharosa Updates 2023

 

 

 

 

jagangivingtractors

 

 

 

 

రైతుల కోసం ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. ఇక నుంచి రైతులకు ఏం అవసరమో వారినే అడిగి కావాల్సినవి అందచేస్తామని వెల్లడించారు. ఇందు కోసం ప్రతీ ఆర్బీకే సెంటర్ రూ 15 లక్షలు కేటాయించామని చెప్పుకొచ్చారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. అతితక్కువ అద్దెతో యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

 

 

అన్ని చర్యలు తీసుకుంటున్నాం : ముఖ్యమంత్రి జగన్ గుంటూరులో ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను ప్రారంభించారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. అతితక్కువ అద్దెతో యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. 15 రోజుల ముందుగానే యంత్రాలను బుక్‌ చేసుకునేలా వైయస్‌ఆర్‌ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని సీఎం జగన్‌ చెప్పారు.

 

 

 

ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అన్నీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. ఆర్బీకే పరిధిలోని రైతన్నలు ఒక గ్రూప్‌గా ఏర్పడి, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ తీసుకొచ్చి ఆర్బీకే పరిధిలోని మిగిలిన రైతులకు తక్కువ ధరకు యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్ణయం చేసామన్నారు.

 

 

తక్కువ ధరలకే రైతుల కోసం : 10,444 ఆర్బీకేల పరిధిలోనూ ఇక మీదట కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ పేరితో ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ యంత్ర పరికరాలు అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షలు కేటాయించి, అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలో ఆ రైతులను డిసైడ్‌ చేయమని చెప్పి, వారు డిసైడ్‌ చేసినదాని ప్రకారం, వారి అవసరాల మేరకు యంత్రాలు తీసుకువచ్చామన్నారు.

 

అదేమాదిరిగానే 491 క్లస్టర్‌ స్థాయిలో వరి బాగా పండుతున్న చోట కంబైన్డ్‌ హార్వెస్టర్లు తీసుకువచ్చామని చెప్పారు. ఒక్కో క్లస్టర్‌ స్థాయిలో రూ.25లక్షలు ఖర్చు చేసి అందుబాటు లోకి తీసుకువచ్చామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇంతకుముందు 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్‌ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌ రైతుల పేరుతో ప్రారంభించామని చెప్పారు.

 

 

 

jagan

 

 

 

ప్రభత్వ సబ్సిడీతో : గ్రూపులుగా ఏర్పడిన రైతులు కేవలం 10 శాతం డబ్బులు కడితే చాటు.. 40 శాతం గవర్నమెంట్‌ సబ్సిడీ కింద ఇచ్చి, మిగిలిన 50 శాతం లోన్ల కింద ఆర్బీకేల పరిధిలో ఉన్న రైతాంగానికి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఆర్బీకే స్థాయిలో ఏ రైతు అయినా వాడుకునేందుకు వీలుగా అతితక్కువ అద్దెతో ఇవన్నీ వారికి అందుబాటులోకి ఉండేందుకు వైయస్‌ఆర్‌ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.

 

 

వీటి వల్ల 15 రోజుల ముందుగానే యంత్రాలను బుక్‌ చేసుకోవచ్చు.. యంత్రసేవలు ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి వచ్చాయని వివరించారు. అక్టోబర్‌ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచిచేస్తూ వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు స్ప్రేయర్లు, టార్పాలిన్లు, వీడర్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button