PM Kisan 2024
PM Kisan రైతన్నా డబ్బులు పడ్డాయా లేదా? ఇలా చెక్ చేసుకోండి..
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస పత్ర, కిసాన్ సమ్మాన్ యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన 16వ విడత నిధులను బుధవారం విడుదల చేశారు. లబ్ధిదారులు తమ పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి తమ ఖాతాల్లో ఆ సొమ్ములు పడ్డాయో లేదో సరి చూసుకోవచ్చు. ఈ పథకాన్ని 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్లో ప్రకటించారు.
ప్రభుత్వాలు అన్నదాతకు భరోసా కల్పించేందుకు అనేక పథకాలను అందిస్తున్నాయి. అనేక రకాల సబ్సిడీలు, రుణాలను సైతం మంజూరు చేస్తున్నాయి. ఎటువంటి పరిస్థితి వచ్చిన రైతు ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ పథకాలు అమలు చేస్తున్నాయి.
వాటిల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస పత్ర, కిసాన్ సమ్మాన్ యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన 16వ విడత నిధులను బుధవారం విడుదల చేశారు. లబ్ధిదారులు తమ పేరు, ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి తమ ఖాతాల్లో ఆ సొమ్ములు పడ్డాయో లేదో సరి చూసుకోవచ్చు. ఈ పథకాన్ని 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్లో ప్రకటించారు. అప్పటి నుంచి అమలు చేస్తున్నారు. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తనిఖీ చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
ఏడాదికి రూ.6000 జమ..
ఈ పథకం కింద లబ్ధిదారులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున మంజూరు చేస్తారు. ఏడాదికి మూడు సార్లు మొత్తం రూ.6000 అందుతాయి. ఏప్రిల్ – జూలై, ఆగస్టు – నవంబర్, డిసెంబర్ – మార్చిలో మూడు సమాన వాయిదాల్లో రైతుల ఖాతాలకు జమచేస్తారు. సాధారణంగా సాగు సమయంలో రైతులకు పెట్టుబడికి ఇబ్బందులు ఎదురవుతాయి. దానికోసం ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. పంట చేతికొచ్చాక వచ్చిన సొమ్ముల్లో ఎక్కువ శాతం ఆ వడ్డీలకే సరిపోతుంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆదుకునేందుకు, వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఇలా తనిఖీ చేసుకోండి..
- పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ పీఎంకేఐఎస్‌ఏఎన్.జీవోవీ.ఇన్ను సందర్శించాలి.
- హోమ్ పేజీలోని బెనిపిషియరీ స్టేటస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- లబ్ధిదారుల స్థితిపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్లలో ఏదో ఒకదానికి ఎంచుకోవాలి.
- ఆ తర్వాత డేటా పొందండి అనే దానిపై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
ఏదైనా సందేహం లేదా సహాయం కోసం లబ్ధిదారులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 1555261, 1800115526, 011 – 23381092ను సంప్రదించాలి. లేదా కిసాన్ యోజన అధికారిక ఈ మెయిల్ పీఎమ్కేఐఎస్ఏఎన్-ఐసీటి@జీవోవీ.ఐఎన్‌ను కూడా సంప్రదించవచ్చు.
ఫిర్యాదు చేయాలనుకుంటే..
ఈ పథకానికి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్లు 011 – 24300606, 155261, టోల్ ఫ్రీ నంబర్ 1800-115-526కు కాల్ చేయాలి. లేదా పీఎంకేఐఎస్‌ఏఎన్-ఐసీటి@జీవోవి.ఐఎన్ లేదా పీఎంకేఐఎస్‌ఏఎన్-ఎఫ్యూఎన్డీఎస్@జీవోవీ.ఐఎన్ చిరునామాకు ఈ మెయిల్ పంపవచ్చు.