PM Kisan Samman Nidhi 2023
రైతులకు కేంద్రం కొత్త ఏడాది కానుక! అకౌంట్లలోకి డబ్బులు? ఎప్పుడంటే..
PM Kisan Yojana | రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి.
PM Kisan 13th Installment | రైతులకు కొత్త ఏడాదిలో తీపికబురు అందబోతోందా? వెలువడున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నదాతలకు త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోకి రానున్నాయి.
మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వం రైతులకు 13వ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను అందించాల్సి ఉంది. వచ్చే వారంలో ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చు. అంటే జనవరి 15 కల్లా డబ్బులు రావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
ఇదే జరిగితే సంక్రాంతి ముందు రైతులకు తీపికబురు అందినట్లు అవుతుంది. అయితే ఇప్పటి వరకే కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ 13 వ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేసేది మాత్రం వెల్లడించలేదు.
ఇప్పటి వరకు చూస్తే.. మోదీ సర్కార్ 12 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అంటే నేరుగానే రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 24 వేలు జమ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి రానున్నాయి.
భారత ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి. మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున ఈ డబ్బులు పొందొచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావించే వారు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు రాకపోవచ్చు. చనిపోయినా రైతుల పేరిట కూడా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయని కేంద్రం గుర్తించింది. ఇంకా అర్హత లేకుండా డబ్బులు పొందే వారు కూడా ఉన్నారని వెల్లడించింది.
అందుకే ఇకేవైసీ తప్పనిసరి చేసింది. అలాగే అర్హత లేకుండా డబ్బులు పొందే వారు తిరిగి ఆ డబ్బులను వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అందువల్ల రైతులు ఈ విషయాలను గుర్తించుకవాలి. అలాగే ఒక్కో కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి.
ఇంకా ఈ స్కీమ్‌లో చేరని వారు ఉంటే.. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి చేరొచ్చు. పొలం పట్టా బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అవసరం అవుతాయి. రేషన్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది. ఉచితంగానే ఈ పథకంలో చేరొచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి మీకు డబ్బులు వచ్చాయా? లేదా? అని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకు రాలేదో కూడా తెలుస్తుంది.