PM Kisan Samman Nidhi 2023 || రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు, వచ్చేది ఈ తేదీనే..
PM Kisan Scheme | మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరారా? అయితే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం 13వ విడత డబ్బులను రైతులకు అందించడానికి రెడీ అవుతోంది.
PM Kisan Yojana | రైతులకు తీపికబురు. బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో 13వ విడత డబ్బులు డిపాజిట్ చేయడానికి రెడీ అవుతోంది. దీంతో రైతులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 2 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ఫిబ్రవరి 24న ఈ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రానున్నాయని తెలుస్తోంది. అంటే ఇంకో ఆరు రోజుల్లో రైతులకు డబ్బులు రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 2 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ఫిబ్రవరి 24న ఈ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రానున్నాయని తెలుస్తోంది. అంటే ఇంకో ఆరు రోజుల్లో రైతులకు డబ్బులు రానున్నాయి.
ఫిబ్రవరి 24న కేవలం పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మాత్రమే కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఆ రోజున రైతు భరోసా డబ్బులను అందించనుంది. అంటే రైతులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 13వ విడత పీఎం కిసాన్ డబ్బులును రైతులకు అందించాల్సి ఉంది. సంక్రాంతి పండుగకే ఈ డబ్బులు వస్తాయని గతంలో నివేదికలు వెలువడ్డాయి. అయితే అలా జరగలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 24న డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయని తెలుస్తోంది.
ఇకపోతే పీఎం కిసాన్ డబ్బులు పొందాలని భావించే రైతులు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఎవరైతే ఇకేవైసీ చేసుకంటారో వారికే ఈ 13 వ విడతల డబ్బులు అందనున్నాయి. మిగతా వారికి మాత్రం ఈ డబ్బులు రావని చెప్పుకోవచ్చు.
పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీకు డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటివి ఇందుకు అవసరం అవుతాయి. అలాగే బెనిఫీషియరి జాబితా కూడా చూసుకోవచ్చు.
డబ్బులు వస్తే.. వచ్చాయని చూపిస్తుంది. అలాగే రాకపోతే.. ఎందుకు రాలేదో కూడా కారణాన్ని తెలియజేస్తుంది. అందువల్ల మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ నుంచి ఈ వివరాలు పొందొచ్చు.
కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్ పథకాన్ని తీసుకువచ్చింది. రైతులు అందరూ ఈ పథకంలో చేరొచ్చు. ఏటా రూ. 6 వేలు ఉచితంగా లభిస్తాయి. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ డబ్బులు వస్తాయి.
పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున లభిస్తాయి. అంటే నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 12 విడతల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు అందాల్సి ఉంది.
మీరు ఇంకా ఈ స్కీమ్‌లో చేరకపోతే.. వెంటనే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి ఉచితంగా పథకంలో చేరొచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పొలం పట్టా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అవసరం అవుతాయి. ఒక ఇంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ వర్తిస్తుంది.