PM Kisan Scheme
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు వచ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్!
PM Modi | రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదా? అయితే ఈ నెలలో బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బులు రానున్నాయి. డేట్ ఎప్పుడో చెక్ చేసుకోెండి.
Farmers | కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో చేరిన రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తూ వస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ స్కీమ్ కింద రైతలు బ్యాంక్ ఖాతాల్లో 13 విడతల డబ్బులను జమ చేసింది.
ఇప్పుడు రైతులు 14వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మొత్తం త్వరలోనే బ్యాంక్ అకౌంట్లలో జమ కానుందని తెలుస్తోంది. అర్హత కలిగిన రైతులకు పీఎం కిసాన్ 14వ విడత కింద మరో రూ. 2 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది.
14వ విడత డబ్బులు ఈ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రానున్నాయి. జూన్ 15న పీఎం కిసాన్ డబ్బులు 14వ విడత అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే ఇంకో రెండు వారాల్లో రైతులకు డబ్బులు లభించనున్నాయి.
ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదనపు చీఫ్ సెక్రటరీ దేవేశ్ చతుర్వేది మాట్లాడుతూ.. దాదాపుగా జూన్ 15న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయని తెలియజేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు లభిస్తాయని ఆయన తెలియజేశారు.
పీఎం కిసాన్ స్కీమ్‌లో దాదాపు 12 కోట్ల మందికి పైగా చేరారు. అయితే దాదాపు 3 కోట్ల మందికి గత రెండు ఇన్స్టాల్మెంట్ల డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం రూల్స్‌ను కచ్చితంగా అనుసరించడం వల్ల కొంత మంది అనర్హులు కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇంకొంత మంది మోసాలకు పాల్పడినట్లు తేలింది.
అలాగే ఇంకా ఇకేవైసీ అనేది కచ్చితంగా చేసుకోవాల్సిందే పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే ప్రతి ఒక్కరూ ఈ ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే వీరికి పీఎం కిసాన్ డబ్బులు రావు. ఇలా ఇంకొంత మందికి కూడా ఈ బెనిఫిట్ లభించడం లేదు.
కొంత మంది ఫోర్జరీ డాక్యుమెంట్లు, సంతకాలతో కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే ఇంకొత మంది ట్యాక్స్ కడుతూ కూడా డబ్బులు పొందుతున్నట్లు తేలింది. ఇలాంటి వారి నుంచి ప్రభుత్వం డబ్బులను మళ్లీ వెనక్కి తీసుకుంటోంది. అందువల్ల అర్హత లేని వారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌కు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.