Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Retubandhu.. Bandh! 2023

రెతుబంధు.. బంద్‌!

 

 

 

రైతుబంధు విషయంలో బీజేపీ ఏకంగా కాంగ్రెస్‌నే మించిపోయింది. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ చెప్తుంటే.. ఏకంగా రైతుబంధును ఎత్తేస్తామని బీజేపీ పరోక్షగా చెప్పేసింది. శనివారం బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఎక్కడా రైతులకు పెట్టుబడి సాయం గురించి ప్రస్తావించలేదు.

 

 

రైతుబంధు విషయంలో బీజేపీ ఏకంగా కాంగ్రెస్‌నే మించిపోయింది. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ చెప్తుంటే.. ఏకంగా రైతుబంధును ఎత్తేస్తామని బీజేపీ పరోక్షగా చెప్పేసింది. శనివారం బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఎక్కడా రైతులకు పెట్టుబడి సాయం గురించి ప్రస్తావించలేదు. కేవలం రూ.2,500 ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని మాత్రమే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్‌ సమ్మాన్‌ నిధి మాత్రమే రైతులకు దిక్కు అని తేల్చేసింది.

 

 

 

 

ఈ పథకం కింద ఒక్క రైతుకు రూ.6 వేలు మాత్రమే సాయం అందుతున్నది. అది కూడా మూడు విడుతల్లో వేస్తున్నారు. పైగా ఈ సాయం అందడానికి అనేక కొర్రీలు పెట్టింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో 65 లక్షల మందికి రైతుబంధు అందుతుండగా, పీఎం కిసాన్‌కు కేవలం 30 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. మరోవైపు బీజేపీ మ్యానిఫెస్టోపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెట్టుకున్న అంచనాలు కూడా అందుకోలేకపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పడంతో నవ్వుకున్నారు. ఆ పార్టీ ఎన్నికల హామీలు తుస్సుమనడంతో ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

 

 

 

 

 

Related Articles

Back to top button