PM Kisan Yojana
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 12వ విడత ఎప్పుడంటే.. !
కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన సంబంధించి 12వ విడత డబ్బులు అక్టోబర్ 2న రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఒక వేళ అక్టోబర్ 2 తేదీన డబ్బులు జమ కాకుంటే అక్టోబర్ 10 లోగా 12 వ విడత డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు పైసాలు జమ చేస్తారనేది కచ్చితమైన సమాచారం లేదు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసేందకు 2019లో పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా భూమి ఉన్న ప్రతీ రైతుకు నాలుగు నెలలకు రూ.2వేలు చొప్పున, సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు రైతులకు 11 విడతలుగా రూ.22 వేలు ఖాతాల్లో వేసింది. ఇప్పుడు 12 వ విడత రైతుల ఖాతాల్లో అతి త్వరలో జమ కానున్నాయి.
అయితే పీఎం కిసాన్ కింద డబ్బులు పొందాలంటే రైతులు తప్పనసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. లేకుంటే డబ్బులు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. ఇప్పటికే ఈకేవైసీ చేసుకోని రైతులకు 11వ విడత డబ్బులు జమ కాలేదు. వీరు ఈకేవైసీ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లో 12వ విడత డబ్బులు జమ అవుతాయి.
1.ముందుగా PMkisan.gov.in వెబ్సైట్ వెళ్లాలి.
2.అందులో ఫార్మర్ కార్నర్ ఉంటుంది.
3. ఫార్మర్ కార్నర్ లో మొదటి ఆప్షన్ eKYC ఉంటుంది.
4. eKYC పై క్లిక్ చేయాలి.
5.అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది
6.ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి
7.ఆ తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
eKYC ప్రక్రియ పూర్తి చేయాలంటే తప్పుకుండా ఫోన్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఆధార్ లింక్ లేకుంటే మీ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్ కు వెళ్లి ఆధార్ తో ఫోన్ నెంబర్ లింక్ చేయాలి. ఇందుకోసం వారు నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు.
గతంలో మీకు ఎన్ని విడతల డబ్బులు వచ్చాయో కింద విధంగా చెక్ చేసుకోవాలి
1.ముందుగా https://pmkisan.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2.హోమ్ పేజీలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3.ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చ ఎంటర్ చేసి సడ్మిట్ చేయాలి.
5.మీ ఎన్ని విడతల డబ్బు వచ్చిందో అందులో తెలుస్తుంది.