Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel
RRC Secunderabad Jobs
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్‌సీఆర్ యూనిట్ పరిధిలోని పలు ప్రదేశాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ఎంపిక విధానం ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 4,232 ఎస్‌సీఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా చూస్తూ.. ఎస్సీ- 635, ఎస్టీ- 317, ఓబీసీ- 1143, ఈడబ్ల్యూఎస్- 423, యూఆర్- 1714 చొప్పున ఉన్నాయి.
ఎస్‌సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు జనవరి 27, 2025వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌సీఆర్ యూనిట్ ప్రదేశాలు ఏమేం ఉన్నాయంటే.. సికింద్రాబాద్, లల్లాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్, నాందెడ్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్.