TSPSC Group-1 Prelims
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
తెలంగాణలో ప్రతిష్టాత్మక గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఎట్టకేలకు శుక్రవారం రాత్రి టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 503 పోస్టులకు గానూ అక్టోబర్ 16న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ అనంతరం వివాదాలు చెలరేగడంతో టీఎస్‌పీఎస్సీ ఫలితాలను హోల్డ్‌లో ఉంచింది.
తాజాగా అన్ని సమస్యలు క్లియర్ కావడం.. హైకోర్టు కూడా ఫలితాలు ప్రకటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్ఫత్తిలో 25,050ని ఎంపిక చేశారు. ఇక జూన్ 1న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.