Rythu Bandhu Status Check 2023 || Rythu Bandhu Online Payment Status
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న రైతుబంధు పథకం కొందరికే అన్నట్లుగా మా రింది.
ఇప్పటికీ 11 ఎకరాల నుంచి 14 ఎకరాల వరకు అందని సహాయం
ఆందోళనకు గురవుతున్న అన్నదాతలు
తమకేమీ తెలియదంటూ చేతులెత్తేస్తున్న వ్యవసాయ శాఖాధికారులు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన రైతులు
జిల్లావ్యాప్తంగా రైతుబంధు కోసం మొత్తం లక్షా 45,726 మంది రైతులను గుర్తించిన జిల్లా అధికారులు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న రైతుబంధు పథకం కొందరికే అన్నట్లుగా మా రింది. అధికారుల నిర్లక్ష్యంతో జి ల్లాలో వందలాది మంది రైతులకు ఎదురుచూపులు తప్ప డం లేదు. ఈ యేడు యాసంగి సీజన్ పెట్టుబడి సహాయా న్ని ప్రభుత్వం విడుదల చేసిం ది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో జ మ కాలేదు. యాసంగి సీజన్ ముగిసిపోతున్నా.. పెట్టుబడి సహాయం అందడం లేదని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో లక్షా 45వేల 726 మంది రైతుల ను అర్హులుగా గుర్తించి వివరాలను ప్రభుత్వానికి పంపించారు. వీరికి సంబంధించి రూ.263కోట్ల 93లక్షల 43,366 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు లక్షా 44,230 మంది రైతు ల ఖాతాల్లోనే రూ.253కోట్ల 40లక్షల 9,291లను జమ చేశారు. మిగిలిన 1,496 మంది రైతులకు సుమారుగా రూ.10 కోట్లను చెల్లించకుండానే వదిలేశారు. ఇదే మిటని అధికారులను అడిగితే ఇదిగో, అదిగో అంటూ కాలం గడుపుతున్నారే తప్ప, సమస్యలు పరిష్కరించి అందాల్సిన నగదును జమ చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అధికారుల నిండు నిర్లక్ష్యం కారణంగా అర్హులైన రైతులు రైతుబంధు పథకానికి దూరమవుతున్నారు. ఎన్నిసార్లు వ్యవసాయ శాఖాధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో విసుగెత్తి పోయిన అన్నదాతలు మంగళవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లాకు రావాల్సింది రూ.10కోట్లు
వ్యవసాయ శాఖాధికారుల తప్పిదాలతో జిల్లావ్యాప్తంగా 1,496 మంది రైతు లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం మొదట తక్కువ భూమిని కలిగి ఉన్న రైతులకు రైతుబందు పథకం కింద నగదును జమ చేస్తూ వచ్చిం ది. ఇలా 10 ఎకరాల వరకు దఫాల వారీగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయాన్ని జమచేసింది. అయితే ఇప్పటి వరకు 11 ఎకరాల నుంచి 14 ఎకరాల వరకు పెట్టుబడి సహాయం అందలేదు. ఎందుకంటే సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో 1,496 మంది రైతుల వివరాలు మిస్ అ యినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిధులు ఉన్న రైతుల ఖా తాల్లో జమచేసే పరిస్థితి లేకుండానే పోయింది. అధికారుల నిర్లక్ష్యం కార ణంగానే జిల్లా రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదంటున్నారు. ప్రభుత్వ సహాయంపై ఎన్నో ఆశలు పెట్టుకుని పంటలను సాగు చేసిన ఫలితమే లేకుండా పోయిందంటున్నారు. గత్యంతరం లేక కొంత మంది రైతులు పెట్టుబడి సహాయం వస్తుందన్న ధీమాతో అప్పులు చేసి మరీ వివిధ రకాల పంటలను సాగు చేసినప్పటికీ.. నగదు చేతికి రాకపోవడంతో దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అధికారుల చుట్టు చక్కర్లు
రైతుబంధు సొమ్ము అందని రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టు నిత్యం చక్కర్లు కొడుతున్నారు. 11ఎకరాల నుంచి 14ఎకరాల లోపు రైతుల వివరాలు మిస్ కావడంపై తమకేమీ సంబంధం లేదంటూ అధికారులు ని ర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అన్నదాతలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసి రైతులకు పెట్టుబడి సహాయం అందే విధంగా చూడాల్సిన అధికారులే చేతులెత్తేయడంపై రైతులు మండిపడుతున్నారు. నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకుండానే పోయిందంటున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలో కొంతమంది రైతులకు రైతుబంధు నిలిచిపోవడంపై రకరకాల పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతోనే రైతుబంధు సొమ్మును నిలిపి వేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో రైతుబంధు అందకుండానే పోయిందన్న విమర్శలు ఉన్నా యి. జిల్లా వ్యవసాయ శాఖను ఇన్చార్జి అధికారితోనే నెట్టుకురావడంతో పట్టింపే లేకుండా పోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. రైతులు ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన సరైన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే పెట్టుబడి సహాయాన్ని అందించాలి
: బాలూరి గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘం నేత
యాసంగి పంటల సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సహాయాన్ని వెంటనే అందించాలి. జిల్లా అధికారులు ప్రత్యేక చొరవను తీసుకుని సమస్యను పరిష్కరించాలి. జిల్లా అధికారి స్పందించక పోవడంతోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర కమిషనర్ దీనిపై ప్రత్యేక దృష్టిని సారించాలి. జిల్లాలో 1,496 మంది రైతుల పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. అధికారులు రైతులకు సరైన సమాధానం కూడా చెప్పడం లేదు.
త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం
: శివకుమార్, ఏవో, ఆదిలాబాద్
జిల్లాలో రైతుబంధుకు సంబంధించి కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు ౄజమ కాలేదు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 11 ఎకరాల నుంచి 14 ఎకరాల లోపు వారికే పెట్టుబడి సహాయం అందలేదు. 14ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా నగదు జమ అయ్యింది. కొంత మంది రైతుల వివరాలు మిస్ కావడంతోనే సమస్య తలెత్తింది. త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటాం.