Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

రైతులకు గుడ్ న్యూస్.. ఈ సారి త్వరగానే Rythu Bandhu.. 2022

ఈ మేరకు జూన్ మొదటి వారంలోనే పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లో వేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.

 

 

 

 

రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయాన్ని ఈసారి త్వరగానే అందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్‌ మొదటి వారంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇక తెలంగాణలోని 66.61 లక్షల మంది రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటికే ఉంది. ఈ డేటాను అప్‌డేట్‌ చేయటం, కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించటం తదితర పనులపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు.

 

జూన్‌ నెల ఒకటో తేదీ నుంచే వానాకాలం సీజన్‌ ప్రారంభం అవుతుంది. దీంతో సీజన్‌ మొదలుకాగానే మొదటి వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేయాలని సర్కార్ భావిస్తోంది. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడు.. మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత కొన్ని సీజన్లలో ఆలస్యంగా ఇచ్చారు. వానాకాలమైతే జూన్‌, జులైలో.. యాసంగి అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇస్తూ వస్తున్నారు.

 

ఈసారి మాత్రం జూన్‌ మొదటివారంలోనే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గడచిన యాసంగి సీజన్‌ నాటికే రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలున్నాయి. 152.91 లక్షల ఎకరాలకు రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. అయితే యాసంగిలో 62.99 లక్షల మంది రైతులకు రూ. 7,411.52 కోట్లు పంపిణీ చేశారు. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించారు. మిగిలిన రైతులకు సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో రైతుబంధు పంపిణీ చేయలేదు. రాబోయే వానాకాలం సీజన్‌లో పట్టాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

 

అయితే ఏకకాలంలో నిధులు సర్దుబాటు చేయటానికి ఆర్థిక శాఖ ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే గత రెండు విడతల్లో చేసినట్లుగానే.. వారం పది రోజుల వ్యవధి తీసుకొని రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో నిధులు వేయనున్నారు. అందుకు అనుగుణంగా డేటాను డివైడ్ చేస్తున్నారు. తొలుత ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు, నాలుగెకరాలు… ఇలా 10 ఎకరాల వరకు పది విడతలుగా నిధులు జమ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు.

 

రైతుల బ్యాంక్ అకౌంట్లో జూన్ 28 నుంచి రైతు బంధు స్కీమ్ నిధులు జమ కానున్నాయి. సీఎం కేసీఆర్ ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎప్పటిలాగే భూ విస్తీర్ణం ఆధారంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈసారి ఈ పథకంలో కొత్తగా మరి కొంత మంది రైతులను చేర్చారు.

 

తెలంగాణ రైతులకు శుభవార్త. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నెల 28 నుంచి రైతుబంధు (Rythu Bandhu) పథకం పెట్టుబడి సాయం నిధులు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు (KCR) బుధవారం (జూన్ 22) ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగే రైతుల భూ విస్తీర్ణం ప్రకారం (ఎకరాల వారీగా) వరుస క్రమంలో వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. అంతకుముందు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. రైతులందరి ఖాతాల్లో త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం జమ చేస్తామని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక, వ్యవసాయ శాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు.
ఎప్పట్లాగే ఈ వానాకాలం సీజన్‌లోనూ సకాలంలో డబ్బులు జమ చేస్తాం. రైతులెవరూ ఆందోళనకు చెందవద్దు’ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం (జూన్ 22) హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్‌ సెంటర్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు గురించి ప్రస్తావించారు.

వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌కు త్వరలోనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించడం, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించిన ఏ వివరాల కోసమైనా ఈ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నదాతలకు ఏటా రెండు సీజన్లకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ పథకం కింద అర్హులైన మరింత మంది రైతులు కొత్తగా చేరారు. రైతుబంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button