Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
Rythu Bharosa
అన్నదాతకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ.15 వేలు, అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన
Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌న్యూస్ చెప్పారు. రైతుభోరోసా అమలుపై కీలక అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో వెల్లడించారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు.
రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.10 వేలు ( రెండు విడతల్లో ఖరీప్, రబీ సీజన్లలో) పంట పెట్టబడి సాయం అమలు చేయగా.. కాంగ్రెస్ ఎకరాకు రూ. 15 వేలు (రెండు విడతల్లో) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందించలేదు.
రైతుబంధు పథకం ద్వారా అనర్హులకు ఆర్ధిక సహాయం అందిందని.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతుందన్న విమర్శల నేపథ్యంలో పథకం అమలులో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని సైతం నియమించి.. ఉమ్మడి జిల్లాల వారీగా పథకం అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించింది.