Sarpanch election notification when..? Revanth Sarkar Key Update
సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు..? రేవంత్ సర్కార్ కీలక అప్డేట్

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయిన నేతలు ఇప్పటికే ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో మంచి చెడులకు హాజరై.. ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తికాగా.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించగా.. ఈ మేరకు తీర్పును అమలు చేసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఏకసభ్య కమిషన్‌ను సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లోగా నివేదిక సమర్పించేలా చూడాలన్నారు. బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను సైతం తక్షణమే ప్రారంభించాలన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక, ఆర్థిక కులసర్వేపై బుధవారం (అక్టోబర్ 9) సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.



