Telangana constable preliminary exam key 2022 || Telangana police constable preliminary exam question paper with answers 2022
Telangana police constable preliminary exam key 2022
మొత్తం పోస్టుల్లో 16,614 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు తొలుత నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉండగా, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 587 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే (మే 26) ఆఖరు తేది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 17,516 పోలీస్ ఉద్యోగాలకు వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ మొత్తం పోస్టుల్లో 16,614 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు తొలుత నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉండగా, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 587 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రోజు (మే 26) రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున.. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) సూచించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.tslprb.in/ ద్వారా ఆన్లైన్ విధానంలో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 16,614 (కానిస్టేబుల్ పోస్టులు- 16027, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు- 587)
- సివిల్ కానిస్టేబుల్ పోస్టులు: 4965
- ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు: 4423
- ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ పోస్టులు: 100
- టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు: 5010
- తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగం పోస్టులు: 390
- డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగం పోస్టులు: 610
- జైల్ వార్డర్లు (మేల్) పోస్టులు: 136
- జైల్ వార్డర్లు (ఫిమేల్) పోస్టులు: 10
- ఐటీ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్గనేజేషన్ కానిస్టేబుల్ పోస్టులు: 262
- కానిస్టేబుల్ (మెకానిక్ (మెన్)) పోస్టులు: 21
- కానిస్టేబుల్ (డ్రైవర్లు) పోస్టులు: 100
- సివిల్ ఎస్ఐ పోస్టులు: 414
- ఏఆర్ ఎస్ఐ పోస్టులు: 66
- ఎస్ఏఆర్ సీపీఎల్ పోస్టులు: 5
- టీఎస్ఎస్పీ ఎస్ఐ పోస్టులు: 23
- తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం ఎస్ఐ పోస్టులు: 12
- డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగం పోస్టులు: 26
- డిప్యూటీ జైలర్ పోస్టులు: 8
- టెక్నికల్ ఎస్ఐ పోస్టులు: 22
- ఎస్ఐ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనేజేషన్ (మెన్) పోస్టులు: 03
- అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఫింగర్ ఫ్రింట్ బ్యూరో) పోస్టులు: 08
- అర్హతలు: కానిస్టేబుల్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- జీతం: కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850ల వరకు ఉంటుంది.
- సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నెలకు రూ.42,300 నుంచి రూ. 1,15,270 ల వరకు ఉంటుంది.
ఆగష్టు 28వ తేదీ ఆదివారం జరగనున్న తెలంగాణ కానిస్టేబుల్ (Telangana Police Jobs) ప్రిలిమినరీ రాత పరీక్షకు (TS Constable Exams) ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు కూడా సిద్ధమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 4939 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆగష్టు 28వ తేదీ ఆదివారం జరగనున్న తెలంగాణ కానిస్టేబుల్ (Telangana Police Jobs) ప్రిలిమినరీ రాత పరీక్షకు (TS Constable Exams) ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు కూడా సిద్ధమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో కేఎస్ఎం కళాశాలలో పరీక్షా కేంద్రాల రీజనల్ కో-ఆర్డినేటర్స్,చీఫ్ సూపరింటెండెంట్స్, అబ్జర్వర్స్ మరియు పోలీసు అధికారులతో గురువారం అవగాహనా సమావేశం నిర్వహించారు. ఆగష్టు 28 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా సమయం ఉండగా…ఈ రాత పరీక్షకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ కొత్తగూడెం మరియు పాల్వంచ పరిధిలోని 39 పరీక్షా కేంద్రాలలో 14,221 మంది, భద్రాచలంలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాలలో 2,856 మంది అభ్యర్థులు ఈ రాత పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారానే అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించడం జరుగుతుందని ఎస్పీ వినీత్ స్పష్టం చేశారు. కొత్తగూడెం రీజియన్ నందు ఏర్పాటు చేసిన 39 పరీక్ష కేంద్రాలకు మైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ పున్నం చందర్, భద్రాచలం నందు ఏర్పాటు చేసిన 10 కేంద్రాలకు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య రీజనల్ కో-ఆర్డినెటర్స్గా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వివరించారు. 49 పరీక్షా కేంద్రాలకు 49 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ మరియు 49 మంది అబ్జర్వర్సుగా వ్యవహరించనున్నారు.