Telangana Govt Jobs 2021-22 || TS Govt Jobs 2021-22 Notifications
Telangana Govt Jobs 2021-22
TS Job Notifications 2021
తెలంగాణలో ఉద్యోగ ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వాటిల్లో సుమారు 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉద్యోగ ఖాళీలకు ప్రత్యేకంగా రెండు విభాగాలను ఏర్పాటు చేసి గుర్తించారు. వివిధ విభాగాల నుండి వివరాలను టీఎస్పీఎస్సీకి పంపించారు. టీఎస్పీఎస్సీ పాలకవర్గం ఏర్పాటు అయ్యాక జోన్ల సమస్య అడ్డంకిగా మారింది. ఇప్పుడు కేంద్రం కొత్త జోన్లకు సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడంతో ఉద్యోగాల భర్తీకి ముందడుగు పడింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదట మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు గుర్తించి అప్పట్లో కేబినెట్‌కు నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి.
నల్గొండలోని వీటీ కాలనీలో దొంగల హల్చల్… సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు గత మంత్రిమండలి భేటీలో ముసాయిదా నివేదిక ఇచ్చాయి. ఆ ప్రాతిపదికన వివరాలు ఇవ్వాలని సీఎం అప్పట్లో సూచించడంతో.. అన్ని శాఖలు ప్రక్రియ పూర్తిచేసి గత వారం నివేదిక సమర్పించాయి. అన్నింటినీ క్రోడీకరించగా 67వేల, 820 ఖాళీలు తేలాయి. పూర్తి జాబితాను త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో సమర్పించనుంది ఆర్థికశాఖ. తెలంగాణలో పీఆర్సీ నివేదిక ప్రకారం లక్ష 91 వేల పైగా ఖాళీలను గుర్తించింది. ఇక ప్రస్తుతం వివిధ శాఖల్లో దాదాపు 67వేల, 820పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అతి త్వరలో మొత్తం 50 వేల పోస్ట్‌లకు సంబంధించి నోటిఫికేషన్లు రానున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో నూతన జోన్ల అడ్డంకి తొలగడంతో ఈసారి స్థానికులకె 90 శాతం ఉపాధి అవకాశాలు రానున్నాయి. జిల్లాల విభజన వల్ల జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగాలు మొత్తం స్థానికులకె రానున్నాయి. దీనికోసం నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టత ఇవ్వడంతో నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
IMPORTANT LINKS
TS Government Job Notifications 2021-22 Full Details