Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
Telangana Group 2-Group 3 Posts || Group 2 & Group 3 Notification Vacancy Details 2022
గ్రూప్ 3, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వివరాలిలా..
తెలంగాణలో గ్రూప్ 3 కింద 1373, గ్రూప్ 2 కింద 663 పోస్టులతో పాటు.. మరికొన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో గ్రూప్ 3(Group 3) కింద 1373, గ్రూప్ 2(Group 2) కింద 663 పోస్టులతో పాటు.. మరికొన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చింది. మొత్తం 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్ రావు(Harish Rao) ప్రకటించారు. వీటితో గడిచిన మూడు నెలల నుంచి మొత్తం 52,460 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందినట్లు పేర్కొన్నారు. మిగిలిన పోస్టులకు కూడా త్వరలో ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వివరాలను వెల్లడించారు. వీటిలో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వెల్లడించినా.. మరి కొన్ని పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అగ్రికల్చర్ విభాగంలో 347 పోస్టులు, వెటర్నరీ అండ్ యానిమల్ హజ్బెండరీ విభాగంలో 294, కోఆపరేటివ్ సొసైటీ లో 99, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో 50, విత్తనోత్పత్తి సంస్థలో 25, హార్టికల్చర్ విభాగంలో 21, మత్స్యశాఖలో 15, అగ్రికల్చర్ మార్కెటింగ్ విభాగంలో 12, ఎలక్ట్రికల్ విభాగంలో 11, గ్రూప్ 3 కింద.. 1373, గ్రూప్ 2 కింద 663 పోస్టులను మంజూరు చేశారు.
గ్రూప్ II పరీక్షా విధానం గ్రూప్ 2 పరీక్ష మొత్తం రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ అనే రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఈ నాలుగు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
పేపర్ I – జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పేపర్ II – చరిత్ర, రాజకీయాలు, సమాజం
పేపర్ III ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్
పేపర్ IV – తెలంగాణ ఉద్యమం మరియు నిర్మాణం
గ్ప్రూప్ 3 కి సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి…
పేపర్-I: విషయానికి వస్తే జనరల్ స్టడీస్: సాధారణ సమార్థ్యాలకు సంబంధించి 150 అబ్జేక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున 150 మార్కులు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చేయడానికి 2.30 గంటల సమయం ఉంటుంది.
పేపర్-II: విషయానికి వస్తే చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజంపై 150 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మూడు చాప్టర్లు ఉంటాయి. అవి
1)తెలంగాణ సామాజిక-సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
2)భారత రాజ్యాంగం, రాజకీయ అవగాహన
3)సామాజిక నిర్మితి, అంశాలు ప్రభుత్వ విధానాలు
ఈ మూడు చాప్టర్ల నుంచి 50 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. సమయం 2.30 గంటలు.
పేపర్-III: తెలంగాణ వ్యవస్థ-అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు ఈ పేపర్ 3లో ఉంటాయి.
ఇందులో మూడు చాప్టర్లు ఉంటాయి. అవి..
1.భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు
2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి
3.అభివృద్ధి, మార్పులు తదితర అంశాలు
ఈ మూడు చాప్టర్ల నుంచి 50 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. సమయం 2.30 గంటలు.
Group 2 & Group 3 Notification Vacancy Details 2022