Telangana Jobs
తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ షాక్.. కేసీఆర్ ప్రకటనతో అన్ని నోటిఫికేషన్లకు బిగ్ బ్రేక్?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తాజాగా ప్రకటించిన ఓ కీలక నిర్ణయం ప్రభావం ఉద్యోగాల భర్తీపై పడనుంది. దీంతో నియామక ప్రక్రియలన్నీ చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటన మేరకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల కూడా భారీగా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కూడా ముగిసింది. వచ్చే నెలలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగనుంది.
టెట్ నిర్వహణ పూర్తయి ఫలితాలు కూడా రావడంతో టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. సీఎం ప్రకటన విడుదలైన నాటి నుంచి మొత్తం 52 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇంకా గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి సైతం ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావొచ్చన్న వార్తలతో నిరుద్యోగులు ప్రిపరేషన్లో మునిగిపోయారు.
చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు కూడా వారి ఉద్యోగాలు మానేసి మరీ పట్టణాలకు చేరి ప్రిపరేషన్ సాగిస్తున్నారు. లక్షలాది మంది యువకులు వేలకు వేలు వెచ్చించి హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన ఓ ప్రకటనతో మొత్తం నియామక ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఏర్పడింది.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. ఈ మేరకు త్వరలో జీఓ విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ఈ నెల 17న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ రిజర్వేషన్లు ఇప్పటి నుంచి విడుదల కానున్న నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందా? లేదా.. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా వర్తిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లలో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటివరకు ఆర్థిక శాఖ 52,460 ఖాళీల భర్తీకి అనుమతులు ఇవ్వగా.. ఇందులో 6 శాతం రిజర్వేషన్ ప్రకారం 3147 ఉద్యోగాలు గిరిజనులకు దక్కనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఖాళీల్లో 6 శాతం రిజర్వేషన్లు అప్లై అయితే.. 4802 ఉద్యోగాలు గిరిజన బిడ్డలకు దక్కనున్నాయి.
అయితే.. సీఎం కేసీఆర్ తాజా ప్రకటన మేరకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే.. మొత్తం 80 వేల ఖాళీల్లో దాదాపు 8 వేల ఉద్యోగాలు గిరిజనులకు దక్కనున్నాయి. ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసిన 52 వేలకు పైగా ఖాళీల్లో దాదాపు 5200 ఉద్యోగాలు ఎస్టీలకు లభించనున్నాయి. ఇప్పటివరకు 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందులోనూ 2 వేలకు పైగా ఖాళీలు గిరిజనులకు లభించనున్నాయి.
అయితే.. 6 శాతం రిజర్వేషన్లు అప్లై అయితే మాత్రం ఇందులో దాదాపు 800 మంది నష్టపోనున్నారు. దీంతో గిరిజన రిజర్వేషన్లకు సంబంధించిన జీవో విడుదల ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. ఈ రిజర్వేషన్లు ఎప్పటినుంచి వర్తింపజేయాలనే అంశం అధికారులకు అంతుచిక్కడం లేదు. ఒకవేళ ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా ఈ రిజర్వేషన్లను అప్లై చేస్తే కోర్టు చిక్కులు కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది.
ఆ చిక్కులు రాకుండా ఉండాలంటే ఆ నోటిఫికేషన్లను కూడా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం కొత్త నోటిఫికేషన్లకు మాత్రమే గిరిజన రిజర్వేషన్ల పెంపు అప్లై చేస్తే.. 4 శాతం రిజర్వేషన్లను కోల్పోతామని గిరిజన అభ్యర్థుల నుంచి ఆందోళనలు వచ్చే అవకాశం ఉంది. వారు కోర్టుకు వెళ్లినా.. సర్కారుకు మళ్లీ చిక్కులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఆ చిక్కులు రాకుండా ఉండాలంటే ఆ నోటిఫికేషన్లను కూడా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం కొత్త నోటిఫికేషన్లకు మాత్రమే గిరిజన రిజర్వేషన్ల పెంపు అప్లై చేస్తే.. 4 శాతం రిజర్వేషన్లను కోల్పోతామని గిరిజన అభ్యర్థుల నుంచి ఆందోళనలు వచ్చే అవకాశం ఉంది. వారు కోర్టుకు వెళ్లినా.. సర్కారుకు మళ్లీ చిక్కులు వచ్చే ప్రమాదం ఉంటుంది.