Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Telangana Government Jobs 2023

Telangana Government : ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1654 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే

 

 

 

 

TS Govt Guest Lecturers : తెలంగాణలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈనెల 24తో ముగియనుంది.

 

 

 

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ జూనియర్‌ లెక్చరర్‌ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 1654 గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన
  • పీజీ మార్కుల ఆధారంగా ఎంపిక
  • జులై 24 దరఖాస్తులకు చివరితేది

 

 

Telangana Guest Lecturers : తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్స్‌ (Junior Lecturers) నియామకానికి ప్రభుత్వం ( (Telangana Government) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి అధ్యాపకులను ఎంపిక చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించి, పీజీ మార్కుల ఆధారంగా, జిల్లా వారీగా 1:3 నిష్పత్తిలో (ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున) దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయాలని ఉత్తర్వులు విడుదలయ్యాయి.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 24వ తేదీ లోగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. జులై 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్‌ అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. ఆయా జిల్లా కలెక్టర్లు 28న ఎంపికైన గెస్ట్‌ లెక్చరర్ల జాబితా వెల్లడిస్తారు. ఖాళీ పోస్టులకు ఎంపికైన గెస్ట్‌ లెక్చరర్లు ఆగస్టు 1వ తేదీన సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

పీజీ‌ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయంలో జులై 24వ తేదీ లోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపాల్‌లతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. పీజీలో సాధిచిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే :

  • సిరిసిల్ల – 27
  • జనగామ- 33
  • గద్వాల- 40
  • వనపర్తి- 48
  • భద్రాద్రి కొత్తగూడెం- 45
  • సిద్దిపేట- 69
  • కామారెడ్డి- 78
  • నిజామాబాద్- 58
  • మహబూబాబాద్- 21
  • మెదక్ – 68
  • నాగర్‌కర్నూల్- 67
  • సూర్యాపేట- 17
  • వికారాబాద్- 59
  • సంగారెడ్డి- 101
  • మేడ్చల్- 24
  • ఆసిఫాబాద్- 61
  • వరంగల్- 19
  • ఖమ్మం- 42
  • హనుమకొండ- 17
  • జగిత్యాల- 51
  • కరీంనగర్- 28
  • నల్గొండ- 53
  • మంచిర్యాల- 37
  • ఆదిలాబాద్- 63
  • పెద్దపల్లి- 42

 

 

 

Related Articles

Back to top button