Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TG Revenue System 2024

మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!

 

 

 

రాష్ట్రంలో గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని సంకల్పించిన ప్రభుత్వం.. ఆ మేరకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు గతంలోనే సూచించింది.

10,954 రెవెన్యూ గ్రామాలకు సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు

ఇప్పటికే ఓసారి నివేదిక ఇచ్చిన సీసీఎల్‌ఏ

మరోసారి నివేదిక కోరిన రెవెన్యూ శాఖ

సిబ్బంది ఎంపిక, హోదా, బాధ్యతలు, విధివిధానాలపై స్పష్టత ఇవ్వాలన్న సర్కారు

 

హైదరాబాద్‌ రాష్ట్రంలో గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని సంకల్పించిన ప్రభుత్వం.. ఆ మేరకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు గతంలోనే సూచించింది. ఈ మేరకు అధ్యయనం చేసిన సీసీఎల్‌ఏ.. ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ నివేదికలో పేర్కొన్న ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గ్రామ స్థాయి రెవెన్యూ యంత్రాంగం ఎంపికపై మరోసారి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తాజాగా సీసీఎల్‌ఏను కోరింది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌.. సీసీఎల్‌ఏకు లేఖరాశారు. కాగా, సీసీఎల్‌ఏ తొలుత ఇచ్చిన నివేదికలో.. గతంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్‌వో, ప్రతి ఆవాసానికి ఒక వీఆర్‌ఏ పనిచేసేవారని, అంతా కలిపి సుమారు 25,750 మంది ఉండేవారిని తెలిపింది. వీరిలో వీఆర్‌వోలుగా 5,195 మంది ఉండగా.. ఎక్కువ మంది డిగ్రీ, ఇంటర్మీడియట్‌ అర్హతతో ఉన్నట్లు పేర్కొంది. ఇక వీఆర్‌ఏలు 20,555 మంది ఉండగా.. వారిలో డిగ్రీ అర్హత కలిగిన వారు 3680 మంది, ఇంటర్మీడియట్‌ వరకు చదివిన వారు 2761, పదో తరగతి అర్హత ఉన్నవారు 10,347 మంది ఉన్నట్లు వివరించింది. ఇకపై గ్రామస్థాయిలో నియమించే రెవెన్యూ సిబ్బందికి జేఆర్‌వో (జూనియర్‌ రెవెన్యూ అధికారి) లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి అనే పేర్లు పెట్టాలని ప్రతిపాదించింది.

 

కీలకం కానున్న రెండో నివేదిక..

 

రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలకు సిబ్బందిని నియమించాల్సి ఉన్నందున.. వారిని ఎంపిక చేయాల్సిన విధానం, అర్హతలు, వేతనాల చెల్లింపులు వంటి అంశాలపై సీసీఎల్‌ఏ రెండోసారి ఇవ్వనున్న నివేదిక కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఎంత మందిని తీసుకోవాలి, పాతవారిని తీసుకుంటే ఏ ప్రాతిపదికన తీసుకోవాలనే దానిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. అయితే.. గతంలో తొలగించిన వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి సుమారు 5వేల మందిని తీసుకోవాలని, నూతనంగా మరో 5 వేల మందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

 

దీంతో గతంలో పనిచేసిన వారిలో ప్రస్తుత అవసరాలకు తగిన అర్హతలు ఉన్నవారిని తిరిగి ఎంపిక చేయాలని రెవెన్యూ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఇదిలా ఉండగా.. గ్రామస్థాయిలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు వివిధ రకాల ధ్రువపత్రాల జారీ, ప్రభుత్వ భూముల సంరక్షణ బాఽధ్యతలు, చెరువులు, కుంటల సంరక్షణ, భూ సమస్యలపై క్షేత్ర స్థాయి విచారణలు, సర్వే పనులకు సహాయకులుగా, విపత్తుల సమయంలో సేవలందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం, ఎన్నికల విధులు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం వంటి విధులు నిర్వహించే బాధ్యతలు అప్పగించాలిన తొలుత ఇచ్చిన నివేదికలో సీసీఎల్‌ఏ ప్రతిపాదించింది.

 

 

 

 

Related Articles

Back to top button