TS DSC Applications 2023 || https://schooledu.telangana.gov.in/ISMS/
తెలంగాణ డీఎస్సీ దరఖాస్తులు.. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే..
సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు 1,597 మంది ఉన్నట్లు అధికా రులు వెల్లడించారు.
తెలంగాణలో టీచర్ ఉద్యోగ నియామకాలకు (Telangana Teacher Recruitment) సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విద్యాశాఖ విడుదల చేసింది.. మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ కు సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్ కూడా దీనిలో భాగంగా విడుదల చేశారు. కొన్ని జిల్లాలో చాలా సబ్జెక్టులకు పోస్టులు లేవు. మరికొన్ని జిల్లాలో అనుకున్న వాటి కంటే.. ఎక్కువ పోస్టులు వచ్చాయి. దీంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 వేల ఉద్యోగాలని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించగా.. తాజాగా 5వేలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంతో డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ పోస్టులకు మరో 8వేల పోస్టులను కలిపి తాజాగా 13వేల పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి oneline విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు 1,597 మంది ఉన్నట్లు అధికా రులు వెల్లడించారు. జిల్లాలో ఖాళీ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో.. దరఖాస్తుల సంఖ్య పెరగడం లేదని తెలుస్తోంది. ఇక 4,144 మంది పరీక్ష ఫీజు చెల్లించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు (https://schooledu.telangana.gov.in/ISMS/) వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. అందులోనే పూర్తి విద్యార్హతల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. టీజీటీ ఉద్యోగాలకు డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వగా.. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కేవలం బీఈడీ వారు అర్హులుగా పేర్కొన్నారు.